సనాతన ధర్మం స్వీకరించి అథర్వ త్యాగిగా పేరు మార్చుకున్న అసద్ ఖాన్

మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో అసద్ ఖాన్ అనే యువకుడు ఇస్లాంను త్యజించి, సనాతన హిందూ ధర్మాన్ని స్వీకరించాడు. అంతేకాకుండా ఆయన పేరును అథర్వ త్యాగిగా మార్చుకున్నాడు.కాశీ నగరంలోని గంగానది ఒడ్డున ఆయన సనాతన ధర్మాన్ని స్వీకరించారు.అయితే తనకు చిన్నతనం నుంచే సనాతన హిందూ ధర్మంపై ఆసక్తి వుండేదని, చిన్నతనంలోనే మహాదేవుడు, శ్రీరాముడు, హనుమంతుని దేవాలయాలకు తరుచుగా వెళ్లేవాడినని వెల్లడించాడు.అంతేకాకుండా అప్పటి నుంచే సనాతన హిందూ ధర్మ ఆచారాలు, సంప్రదాయాలను అధ్యయనం చేయడం, ఆచరించడం చేసేవాడినని, హనుమాన్ చాలీసా కూడా కంఠోపాఠంగా వచ్చేదని తెలిపాడు.
తాను పేరుకు మాత్రమే ముస్లింనని, మిగతా అంతా సనాతన ధర్మీయుడినేనని చెప్పుకొచ్చాడు.తాను ముస్లింనని, దేవాలయాలను సందర్శించిన సమయంలో చాలా మంది అవమానించారని వెల్లడించాడు. దీని కారణంగా చాలా మానసిక సంఘర్షణను అనుభవించానని, దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికే కాశీకి వచ్చి, సనాతన ధర్మాన్ని స్వీకరించానని తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *