సరసంఘచాలక్ మోహన్ భాగవత్ కి రాఖీలు కట్టిన టిబెట్ మహిళలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ కి పలువురు రాఖీలు కట్టి, రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాగపూర్ లో వున్న సంఘ్ ప్రధాన కార్యాలయానికి పలువురు వచ్చి, మోహన్ భాగవత్ కి రాఖీలు కట్టారు.ప్రాంతీయ టిబెటన్ మహిళా సంఘం, భారత్ టిబెట్ సహకార వేదిక సోదరీమణులు RSS చీఫ్ మోహన్ భగవత్‌కు రాఖీ కట్టారు. ఆయనకు ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా రాష్ట్రీయ సేవిక సమితి సోదరీమణులు, మహల్ ప్రాంగణ నివాసితులు ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా, ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆర్ఎస్ఎస్ లోని అనేక మంది ముఖ్యులకు భారత్ టిబెట్ సహయోగ్ ఉద్యమ మహిళా కార్యకర్తలు రాఖీలు కడుతున్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మహిళలకు స్వీట్లు బహుకరించారు.