సరిహద్దుల్లో ”బీటింగ్ రిట్రీట్” పున: ప్రారంభం

భారత్, పాక్ అంతర్జాతీయ సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ వేడుకలు మంగళవారం నుంచి తిరిగి ప్రారంభం అవుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దులో పాక్ సైనికులతో బీటింగ్ రిట్రీట్ నిలిపేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గిన నేపథ్యంలో బీటింగ్ రిట్రీట్ పున: ప్రారంభం అవుతోంది. భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దులోని మూడు చెక్ పోస్టులు అటారీ వాఘా, హుస్సేన్ వాలా, సద్కి వద్ద బీటింగ్ రిట్రీట్ పున: ప్రారంభం అవుతుందని బీఎస్ఎఫ్ ప్రకటించింది.
అయితే.. బీటింగ్ రిట్రీట్ తిరిగి ప్రారంభమైంది కానీ.. పలు ఆంక్షల నడుమ వుంటుంది. జెండా అవనతం ప్రక్రియ సమయంలో బార్డర్ గేట్లు తెరవమని, బీఎస్ఎఫ్ దళాలు పాక్ రేంజర్లతో కరచాలనం చేయమని బీఎస్ఎఫ్ ప్రకటించింది. అలాగే కార్యక్రమ సమయాన్ని కూడా తగ్గించినట్లు పేర్కొన్నారు. అలాగే మొదటి రోజు మీడియాకి అనుమతి వుంటుందని, ఆ తర్వాత సాధారణ పౌరులందరికీ అనుమతి వుంటుందని అధికారులు తెలిపారు.
ఇవాళ సాయంత్రం ఆరు గంట‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది. అమృత్‌స‌ర్‌కు స‌మీపంలో ఉన్న అత్తారి బోర్డ‌ర్‌తో పాటు ఫిరోజ్‌పుర్‌లోని హుస్సేనివాలా, ఫ‌జిల్కాలోని స‌ద్కి బోర్డ‌ర్ వ‌ద్ద బీటింగ్ రిట్రీట్ ఉంటుంది. 5.30 నిమిషాల‌కు భారీ సంఖ్య‌లో స‌ద్కీ బోర్డ‌ర్‌కు చేరుకోవాల‌ని స్థానికుల‌కు బోర్డ‌ర్ ఏరియా డెవ‌ల‌ప్మెంట్ ఫ్రంట్ పిలుపునిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *