సామాజిక సమరసత

పంచపరివర్తన్‌

భాగం-2

కనకదాసు విజయనగర సామ్రాజ్యంలో దండనాయకుడిగా ఉంటూ దైవ భక్తితో – చేతిలో ఏకతారతో హరినామకీర్తన చేసుకుంటూ ఉండే వాడు. ఒకసారి ఆయన ఉడిపిలో శ్రీకృష్ణదర్శనం కోసం వెళ్లాడు. ఆయనకు ఆలయ అధికారులు దర్శనం నిరాకరించారు. నువ్వు పంచముడవన్నారు, అంటానివాడవన్నారు. కనకదాసు భక్తితో శ్రీ కృష్ణునిగానం చేశాడు. కృష్ణ విగ్రహం తూర్పు దిక్కున ఉండేది. కనకదాసు బయటవుండి కిటికీ నుంచి మనసులో ధ్యానించుకుంటూ కృష్ణున్ని కీర్తిస్తున్నాడు. పెళఫెళధ్వనులు వినబడ్డాయి. కృష్ణ విగ్రహం కనకడాసు దర్శించుకుంటున్న వైపు తిరిగింది. భగవంతుడు అంతా ఒక్కడే. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు పండితులను, పామరులను ఒకేవిధంగా చూడమన్నాడు. ఇప్పటికీ ఉడిపలో ‘కనకదాసు కిటికీ’ (కన్నడలో) అని రాసి ఉంటుంది.

శ్రీ రామచంద్రుడు గుహుడి ఆతిథ్యం స్వీకరించాడు. 90 ఏళ్ళుగా భక్తితో వేచిచూస్తున్న శబరి ఎంగిలి పళ్ళను తిని ఆమెను అనుగ్రహిం చాడు. స్వామి వివేకానంద తమ ఆరేళ్ళ భారత పర్యటనలో బృందావనానికి వెళ్తూ మార్గంలో స్వామిజీ చెప్పులుకుట్టేవాని ఇంట భోజనం చేశారు.  మరోచోట ఒక దళితుడు ఇచ్చిన మంచి నీరు తాగారు. పేద ప్రజలను దరిద్ర నారాయణు లన్నారు. జగద్గురు ఆదిశంకరులు పంచముడని భావింపబడే వ్యక్తిలో శివుణ్ణి చూశారు. అంతా శివనామ అన్నారు. అద్వైతం భోధించారు. అంతా ఒక్కడే అన్నారు. భగవత్‌ రామానుజులు తాను నరకానికి వెళ్ళినా ఫరవాలేదు అని కోవెలనెక్కి అందరికీ నారాయణ మంత్రోపదేశం చేశారు.

రాష్ట్రీయ స్వయంసేవకసంఘంలో స్వయం సేవకులంతా ఇదే స్ఫూర్తితో పని చేస్తుంటారు. సంఘంలో ఎవరి కులము ఏమిటో ఎవరికీ తెలియదు. పరిచయ కార్యక్రమంలో కూడా తమ వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ఎక్కడుంటారు, ఎన్ని సంవత్సరాల నుంచి శాఖకు వస్తున్నారు, సంఘ పని లేదా పరివాక్షేత్రాల పని చేస్తున్నారు అనే చెబుతారు తప్ప ఏ కులానికి చెందిన వారో చెప్పరు.  సంఘము, పరివారక్షేత్రాలు సమ్మేళనాలు నిర్వహిస్తుంటాయి. ఇందులో అన్ని భేదభావాలు మరచి అందరం హిందులం అనే భావంతో అంతా కలుస్తారు.

1983 నవంబరు, డిసెంబరు నెలల్లో విశ్వ హిందూ పరిషత్‌ ఏకాత్మతా యాత్ర నిర్వహించింది. గంగామాత, భారతమాతలను రథాలపై మూడు ప్రధానయాత్రలు, వందలాది అనుబంధయాత్రలలో ఈ యాత్ర 50 వేల కి.మీ. సాగిపోయింది. 1988లో సంఘ స్థాపకులు డాక్టర్జీ జన్మ శతాబ్ది ఉత్సవాలలో 2,16,284 గ్రమాలకు స్వయం సేవకులు వెళ్ళి, 1,48,70,682 కుటుంబాలను కలుసుకున్నారు. 76,427 సమావేశాలు నిర్వహిం చారు. అందరినీ కలుద్దాం. అందరినీ కలుపు కుందాం, ఇదే సంఘ పరమ లక్ష్యం. ‘అంటారిని తనం నేరం కాకపోతే మనేదీ నేరం కాదు’ అని నాటి సంఘ సర్‌సంఘచాలక్‌ పరమ పూజ్య శ్రీ బాలాసాహెబ్‌ దేవర్‌ ప్రకటించారు. ‘నహిందూ పతితో భవేత్‌’, ‘మమదీక్షా హిందురక్షా, మమ మంత్ర సమానత’ నినాదాలు హిందూ సమాజాన్ని నిద్రలేపాయి. ‘హరిజనులు, వనవాసీలతో సహా మన దేశంలో ఎన్నో వెనుకబడిన వర్గాలున్నాయి. వారి సమస్యల పరిష్కారం కోసం తీవ్రమైన వాదాలు బయలుదేరాయి. సంఘ మార్గం భిన్నమైది. స్వయంసేవకులు ఎందరో ఈ వర్గాలనడుమ పనిచేస్తున్నారు. త్వరలోనే డాక్టర్లూ, టీచర్లూ ఆ వర్గాలమధ్య ఉండి వారికోసం పనిచేసే వాతావరణం నిర్మాణం అవుతుంది.

సంగ్లీలో సంఘకార్యకర్త దేవర్‌జీ హరిజన గ్రామాలను ప్రగతికి ప్రతి రూపాలుగా రూపొందించి చరిత్ర సృష్టించారు. ఇదే మనమార్గం’ అన్నారు బాలసాహెబ్‌ దేవరస్‌. ఇవాళ శ్రీ దేవర్‌లాంటి కార్యకర్తలెందరో ఆ పనిలో నిమగ్నమయ్యారు. సంఘం దేశంలో లక్షా అరవై వేల సేవాకార్యమాలు నిర్వహిస్తోంది.

– హనుమత్‌ ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *