సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు

తెలంగాణలో సేంద్రీయ వ్యవసాయాన్ని భారీగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సేంద్రీయం వైపు వచ్చే రైతులకు భారీగా ప్రోత్సాహకాలు, రాయితీలు అందించేందుకు కూడా ప్రణాళికలు రూపొందించింది. పరంపరాగత్ కృషి వికాస్ యోజన (PKVY) కింద కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ సేంద్రీయ సాగును ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. దీని స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం కూడా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సేంద్రీయ సాగు పద్ధతులకి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా ఆకర్షించింది.దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్ర పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది.

సేంద్రీయ వ్యవసాయం చేయడానికి రైతుల్లో చైతన్యం తెచ్చేందుకు శాస్త్రీయ ప్రణాళికలను కూడా రూపొందిస్తోంది. 7 బస్తాల రసాయన ఎరువులు వాడే రైతులు ఇక నుంచి విధిగా సగం సేంద్రీయ ఎరువులు జోడించాలని ఇప్పటికే పార్లమెంటరీ స్థాయి కమిటీ సూచించింది. దానిని కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. వెంటనే రైతుల్లో అవగాహన రాకపోయినా… సేంద్రీయంపై భారీగా అవగాహన కల్పించాలని, ఎరువుల క్రమబద్ధీకరణ, సేంద్రీయచ, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని తలపోసింది.

పీకేవీవై కింద సేంద్రీయ సాగు చేస్తున్న ఒక్కో రైతుకు రెండున్నర ఎకరాలకు మూడేండ్లలో ప్రోత్సాహకంగా 50 వేల రూపాయలు అందిస్తారు. ఒక్కో రైతుకు రెండున్నర ఎకరాలకు మూడేండ్లలో ప్రోత్సాహకంగా 50 వేలు అందిస్తారు. ఇందులో ఆర్గానిక్ ఇన్ పుట్ కోసం 31 వేలను రైతుల ఖాతాలకు నేరుగా జమ కూడా చేస్తారు. అదే విధంగా మార్కెటింగ్, ప్యాకేజీ బ్రాండింగ్, విలువల జోడింపుకు 8,800, సర్టిఫికేషన్ కి 2,700 అవసరమైన శిక్్షణ, సామర్థ్యం పెంచేందుకు 7,500 సాయం అందిస్తారు.

50 ఎకరాల చొప్పున ఒక్కో క్లస్టర్ ను ఏర్పాటు చేసి, రాష్ట్రంలో 2 వేల క్లస్టర్లో సేంద్రీయ సాగును ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం లక్ష ఎకరాల్లో ఆర్గానింగ్ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. గతంలో కంటే 4 రేట్లు సేంద్రీయ సాగుని ప్రోత్సహించాలని తెలంగాణ నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *