సేవాయజ్ఞపు సాక్ష్యాధారాలతో “ఎ సెంచరీ ఆఫ్ సర్వీస్”

సమాచార భారతి సాంస్కృతిక సంఘం, తెలంగాణ ఆధ్వర్యంలో  ఆనంద్ సాల్వే జీ రచించిన ‘‘ఎ సెంచరీ ఆఫ్ సర్వీస్ “A Century of Service – షెడ్యూల్డ్ కులాలు, గిరిజనుల మధ్య ఆర్‌ఎస్‌ఎస్ సేవా కార్యక్రమాలు” అనే గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ ‌లోని శోభా గార్డెన్స్, మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్, జరిగింది.  ఈ సందర్భంగా ఈ పుస్తకంతో పాటుగా “తెలుగు ప్రాంతాలలో ఆర్‌ఎస్‌ఎస్” అనే తెలుగు పుస్తక పరిచయ కార్యక్రమం కూడా జరిగింది. తెలుగు ప్రాంతాలలో ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన సామాజిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను ఈ పుస్తకం సమగ్రంగా వివరిస్తుంది. అదేవిదంగా “A Century of Service” గ్రంథం ద్వారా గత వందేళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్ షెడ్యూల్డ్ కులాలు, గిరిజనుల మధ్య నిర్వహించిన సేవా కార్యక్రమాలను సాక్ష్యాధారాలతో వివరించింది. ఈ పుస్తకాన్ని సంవిత్ ప్రకాశన్ ప్రచురించింది.
samachara2
ఈ కార్యక్రమానికి సమాచార భారతి అధ్యక్షులు గోపాల్ రెడ్డి ప్రస్తావన చేశారు. సమాజంలోని అన్ని వర్గాల మధ్య సమరసత, ఐక్యత పెంపొందించడంలో ఇటువంటి గ్రంథాలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్ట్ లేబర్ కమిషనర్, వనవాసీ కల్యాణాశ్రమం అఖిల భారతీయ ఉపాధ్యక్షులు హెచ్. కె నాగు విచ్చేయగా, ప్రధానవక్తగా అఖిల భారతీయ సామాజిక సమరసత సంయోజక్ కె.శ్యామ్ ప్రసాద్  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ, సంఘ సామాజిక సమరసత, విద్య, ఆరోగ్యం, స్వావలంబన వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది అని పేర్కొటూ, ఈ గ్రంథాలు ఆర్‌ఎస్‌ఎస్ సేవా కార్యకలాపాలపై వాస్తవ ఆధారిత అవగాహనను కలిగిస్తాయని చెబుతూ, సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడమే సంఘ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్  భాగ్ సంఘచాలక్  సాంబమూర్తి, గ్రీన్ ఫీల్డ్స్ నగర్ ‌కు చెందిన టీవీ సురేష్ జీ, జీడిమెట్లకు చెందిన  అర్జున్ రావుతో పాటుగా పలువురు మేధావులు, సామాజిక కార్యకర్తలు, స్వయంసేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత కృతజ్ఞతా ప్రకటనతో ఈ కార్యక్రమం ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *