’సేవా భారతి‘ బృహత్ కార్యక్రమం… వయనాడ్ నిర్వాసితులకు ఇళ్లు కట్టించాలని నిర్ణయం

కేరళ సేవాభారతి యూనిట్ బృహత్తర కార్యక్రమంతో ముందుకు వచ్చింది. వయనాడ్ విధ్వంసకర ప్రళయం తర్వాత అక్కడి బాధితులను ఆదుకునేందుకు ఈ బృహత్ ప్రణాళిక చేపట్టింది. వయనాడ్ ప్రళయం కారణంగా నిరాశ్రయులైన వారందరికీ పునరావాస ప్రణాళికను చేపట్టింది. నిర్వాసితులైన వారందరికీ ఇళ్లు కట్టించేందుకు ముందుకు వచ్చింది. వార్షిక సర్వసభ్య సమావేశంలో సేవా భారతి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ముప్పైనాడ్ ప్రాంతంలో ఐదెకరాల భూమిని కూడా కొనుగోలు చేసింది సేవా భారతి. వచ్చే నెలలో ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది. అంతేకాకుండా ‘‘పునర్జనిక్’’ అన్న పథకాన్ని కూడా తీసుకొచ్చింది సేవా భారతి. కొండచరియలు విరిగిపడటం, వారి కళ్ల ముందే అనేక ఇబ్బందులు రావడంతో, వాటిని చూసి, మానసికంగా ఇబ్బందికి గురైన వారికి కూడా మానసికంగా బాగు చేసేందుకు కూడా సేవా భారతి ప్రణాళికలు రచించింది. అలాంటి వారి కోసమే ఈ పునర్జనిక్ పథకం.
మరోవైపు వయనాడ్ లోని విద్యార్థుల కోసం ‘‘విద్యా స్కాలర్ షిప్’’ అన్న కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. పాఠశాల స్థాయి నుంచి మొదలు పెడితే.. వృత్తిపరమైన కోర్సుల వరకూ ఈ స్కాలర్ షిప్ వర్తిస్తుంది. విద్యార్థులందరూ సేవా భారతి వెబ్ సైట్ : సేవాభారతి కేరళం అన్న వెబ్ సైట్ ద్వారా స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సేవా భారతి ప్రకటించింది. మరోవైపు పాత్రికేయుల సమావేశంలో ‘‘ఆపత్ సేవా బృందం తయారు చేసిన ‘‘సురక్ష’’ హ్యాండ్ బుక్ ను విడుదల చేశారు. కల్యాణ్ జువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కల్యాణ రామన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా… అఖిల భారతీయ సహ సేవా ప్రముఖ్ రాజ్ కుమార్ మరాటే మార్గదర్శనం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *