స్వయంగా బట్ట సంచీలు కుట్టి, పంపిణీ చేసిన పాల్వంచ శిశు మందిర్ విద్యార్థులు

ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం, పర్యావరణాన్ని కాపాడటం, చెట్లను పెంచాలంటూ శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాల్వంచ పాఠశాల చక్కటి అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పర్యావరణాన్ని, భూమిని, పచ్చదనాన్ని కాపాడాలంటూ పాఠశాల విద్యార్థులతో ”save earth”- save water” అంటూ చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. దీంట్లో విద్యార్థులందరూ అద్భుతమైన ప్రదర్శన చూపించి, ఉత్సాహంగా పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడుకొని, భవిష్యత్ తరాలకు మంచి ప్రకృతిని, పచ్చటి ప్రకృతిని అందించాలంటూ చక్కటి చిత్ర లేఖనంతో పిలుపునిచ్చారు. అలాగే ఇదే విషయంపై ముగ్గులు వేశారు. చెట్లను పెంచుతూ, పర్యావరణాన్ని కాపాడాలంటూ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
ssm2
మరో వైపు ప్లాస్టిక్ వాడకం ద్వారా ఎనలేని నష్టం వాటిల్లుతోందని, దీనిని పూర్తిగా నిషేధించాలని కూడా పాఠశాల విద్యార్థులు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి, బట్ట సంచులను మాత్రమే వాడాలంటూ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పాఠశాల యాజమాన్యం మొదటగా బట్ట సంచులు కుట్టే ప్రక్రియను విద్యార్థులకు నేర్పించారు. బట్ట సంచులను కుట్టడం అనే ప్రక్రియను శ్రద్ధగా నేర్చుకున్న పాఠశాల విద్యార్థులు స్వయంగా తామే బట్ట సంచులు కుట్టారు. కుట్టిన ఆ బట్ట సంచులపై పాఠశాల పేరును కూడా రాసి, ప్రజలకు పంచి పెట్టారు. ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని, కేవలం బట్ట సంచులనే వాడి భూ మాతను కాపాడాలని విద్యార్థులు ఇల్లిళ్లూ తిరిగి, ప్రచారం చేస్తుంటే బస్తీ వాసులకు ముచ్చటేసింది.
ssm
అలాగే విత్తన బంతులను తయారు చేసే విధానాన్ని కూడా విద్యార్థులకు ఆచార్యులు నేర్పించారు. దీనిని కూడా విద్యార్థులు అత్యంత శ్రద్ధగా నేర్చుకొన్నారు. తర్వాత విత్తన బంతులను (seed balls)అటవీ ప్రాంతంలోకి వెళ్లి, వందలాది విత్తలను బంతులను అటవీ ప్రాంతంలో వేశారు.
ssm23
అమిత ఆనందాన్ని వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, సమాజం
శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో తమ పిల్లలకు విద్యా బుద్ధులతో పాటు సమాజం గురించి, పర్యావరణ పరిరక్షణ లాంటి విషయాలు కూడా తమ పిల్లలకు నేర్పుతున్నారని పోషకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకృతిపై, భూమిపై తమ పిల్లలకు ప్రేమ, భక్తి భావాలు స్థిరపడుతున్నాయని, పాఠశాల చేస్తున్న ప్రయత్నాలు అద్భుతంగా వున్నాయన్నారు. మరో వైపు పాల్వంచ స్థానిక ప్రజలు కూడా సరస్వతీ శిశు మందిర్ విద్యార్థులు చేస్తున్న సామాజిక సేవను చూసి ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *