స్వర్ణ పత్రాలు
మన చరిత్రకు చెందిన కాలానికి సంబంధించిన కొన్ని పుటలను ‘‘బంగరు పుట’’లని పేర్కొనబోతున్నారు. అందుకు కారణమేమిటి? కొలబద్ధ లేమిటి? అని ప్రశ్నిస్తే ఆ కాలానికి సంబంధించిన చరిత్రల కావ్య, సంగీతాలలోను పౌరుష పరాక్రమాలు, ఐశ్వర్య అధ్యాత్మ్యాలకు చెందిన పుటలలో – పై కొలబద్దకు సరిపోగలవి – అనేక పుటలు దొరుకుతాయి. అవే స్వర్ణపత్రాలు. కానీ ఏదైనా ఒక దేశం మీద పరాయి పరిపాలన అన్న మేఘాలు అలుముకొని వుండి దురాక్రమణ దారుల కాళ్ళక్రింద ఆ దేశం నలిగిపోతూవుంటే ఆ పరాయి పరిపాలననుంచి దేశానికి ముక్తి కలిగి ప్రబల శత్రువును పరాభవించి అపరిమిత పరాక్రమంతో తన దేశాన్ని పరిపాలన నుండి స్వతంత్రం చేసి స్వరాజ్యాన్ని స్థాపించిన తరం – ఆ తరానికి నాయకత్వం వహించిన వీరుల విజయాలను, వివరాలను అందించే చరిత్ర పుటలను నేను స్వర్ణప్రతాలు అని పేరొంటున్నాను.
-స్వాతంత్య్రవీరసావర్కర్