స్వామి గోవింద దేవ్ గిరి మహారాజ్ కి హెడ్గేవార్ ప్రజ్ఞా సమ్మాన్ అవార్డు ప్రదానం
శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి పూజ్య స్వామి గోవింద దేవ్ గిరి మహారాజ్ కి 36వ డాక్టర్ హెడ్గేవార్ ప్రజ్ఞా సమ్మాన్ అవార్డు వరించింది.ఈ సందర్భంగా పూజ్య స్వామీజీకి లక్ష రూపాయలతో పాటు సర్టిఫికేట్ ను ప్రదానం చేశారు.ఈ సందర్భంగా స్వామి గోవింద దేవ్ గిరి మహారాజ్ మాట్లాడుతూ ప్రపంచ శ్రేయస్సు అనేది భారత ఆలోచనల్లోనే వుందని అన్నారు. అలాగే భారత దేశ బలం మొత్తం వ్యవస్థీకృతంగా వున్న హిందూ సమాజంలోనే నిబిడీకృతమై వుందని వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంస్థాపకులు హెడ్గేవార్ వ్యక్తిత్వాన్ని స్వామి గోవింద దేవ్ గిరి మహారాజ్ ఆవిష్కరించారు.డాక్టర్జీ నిర్ణయించుకున్న లక్ష్య పథంలో బలంగా వుండేవారని, దృఢమైన సంకల్ప బలం, అంకిత భావంతో వుండేవారన్నారు. క్లిష్ట పరిస్థితులలోనూ జాతి నిర్మాణం కోసం పనిచేశారని, అత్యంత ఆశావాద దృక్పథంతోనే ముందుకు సాగారన్నారు. హెడ్గేవార్ త్యాగం, తపస్సు ఫలితంగానే నేడు భారత్ ప్రపంచ స్థాయి లో నాయకత్వం వహించడానికి సిద్ధమవుతోందని తెలిపారు.ఇక.. ఈ కార్యక్రమానికి సిక్కిం గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. డాక్టర్జీ స్థాపించిన ఆరెస్సెస్ ఇప్పటికీ దేశభక్తి విషయంలో స్ఫూర్తినిస్తూనే వుందన్నారు.