హనుమంతుడు కల్పిత దేవుడట… తీవ్రంగా అవమానించిన అమెరికా నేత

హిందువులకు ఆరాధ్య దైవమైన, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా అమితంగా ఆరాధించే హనుమంతుడిపై అమెరికాలోకి రిపబ్లిక్ పార్టీకి చెందిన నాయకుడు అలెగ్జాండర్ డంకన్ తీవ్ర అవమానకర వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలో హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. అలాగే హనుమంతుడు కల్పిత దేవుడంటూ నోరు పారేసుకుంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
‘టెక్సాస్ నగరంలో కల్పిత హిందూ దేవుడికి సంబంధించిన కల్పితమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఎలా ఒప్పుకున్నారు. మనది క్రిష్టియన్ దేశం’ అంటూ మతోన్మాద వ్యాఖ్యలు చేశాడు. అలాగే బైబిల్ లోని మాటల్ని కూడా ఉటంకిస్తూ.. ‘‘నీకు నేను తప్ప వేరే దేవుడు ఉండొద్దు’’ అన్న దానిని కూడా ఆ పోస్టులో పేర్కొన్నాడు.
తీవ్రంగా ఖండించిన హిందూ అమెరికన్ ఫౌండేషన్..
డంకన్ వ్యాఖ్యలపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ తీవ్రంగా విరుచుకుపడింది. హనుమంతుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ప్రకటించింది. హిందూ ద్వేష పూరిత వ్యాఖ్యలు చేశాడని, అంతేకాకుండా అమెరికన్ రాజ్యాంగ విలువలను కూడా ఉల్లంఘించాడని మండిపడింది. ఆయనపై వెంటనే రిపబ్లికన్ పార్టీ చర్యలకు దిగాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా ‘‘మీ సెనెట్ అభ్యర్థిని క్రమశిక్షణలో వుంచుతారా? వుంచరా? ఆయన రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు.’’ అంటూ హిందూ అమెరికన్ ఫౌండేషన్ మండిపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *