హిందువుల ఆందోళనతో ఫీజుపై వెనక్కి తగ్గిన తిరువిత్తంకూర్ దేవస్థానం
హిందువుల ఆగ్రహం, నిరసనకి తిరువిత్తంకూర్ దేవస్థానం బోర్డు దిగొచ్చింది,. దర్శనార్థం వచ్చే భక్తులకు తిలకం పెట్టడానికి, గంధం పెట్టడానికి పది రూపాయల ఫీజు వుంటుందని బోర్డు ప్రకటించింది. కానీ… హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గారు.ఎరుమేలి పేట తుల్లల్ పండగ సందర్భంగా తిలకం, గంధం కోసం పది రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఇది హిందువులకు అత్యంత అవమానకరమని హిందూ సంఘాలు మండిపడ్డారు. తీవ్ర నిరసనలకు దిగారు. అయితే.. శబరియాత్ర లో భాగంగా సంప్రదాయంగా జరుపుకునే నృత్యం ఎరుమేలి పెట్ట తుల్లల్. ఈ సమయంలో తిలకం, గంధ ధారణ చేస్తుంటారు. గత యేడాది చాలా మంది విరాళాలివ్వడంతో ఎలాంటి ఇబ్బందులు రాలేదు.
కానీ ఈ సంవత్సరం తిరువితంకూర్ దేవస్థానం ఈ పనిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. అంతేకాకుండా పది రూపాయలు వసూలు చేసే బాధ్యతను కూడా అప్పగించింది. మొత్తం నాలుగు చోట్ల ఈ తిలక ధారణ చేయాలని నిర్ణయించారు. మొదటి చోట 3 లక్షలు, మిగతా మూడు చోట్ల 7లక్షల మేర కాంట్రాక్ట్ ఒప్పందం కుదిరింది. దీంతో వివాదం మొదలైంది. చివరికి స్వచ్ఛంద విరాళాల సంప్రదాయాన్నే పునరుద్ధరిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.