హిందువుల పోరాటంతో తిరిగి తెరుచుకున్న పురాతన దేవాలయం

అమేథీ జిల్లాలోని ఔరంగాబాద్ అనే గ్రామంలో రెండు దశాబ్దాల తర్వాత తిరిగి పురాతన శివాలయం తెరుచుకుంది. రెండు దశాబ్దాల పాటు ఆక్రమణకు గురైన ఈ దేవాలయం… తిరిగి తెరుచుకోవడంతో స్థానిక హిందువులు పూజలు చేయడం ప్రారంభించారు. దాదాపుగా 120 సంవత్సరాలకు పైగా పురాతనమైంది. అధికారులు జోక్యం చేసుకొని, ఆక్రమణలను తొలగించారు. గత 20 సంవత్సరాలకు దేవాలయానికి పూజలే లేవు. ఓ దళిత హిందూ కుటుంబం ఈ దేవాలయాన్ని స్థాపించారు.

కాలక్రమేణా ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా పెరిగిపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో హిందువులు ఆ దేవాలయంలో పూజలు చేయడం మానేశారు. 20 సంవత్సరాలుగా దేవాలయం మూతపడే వుంది. స్థానిక హిందువులు అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోలేదు. చర్యలు తీసుకోలేదు. అయితే.. తాజాగా స్థానిక హిందువుల నుంచి అధికారులపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. హిందువులు కూడా ధైర్య సాహసాలతో అధికారులను ప్రశ్నించడం ప్రారంభించారు. దీంతో అధికారులు జోక్యం చేసుకొని, ఆక్రమణలను తొలగించి, దేవాలయం తిరిగి తెరుచుకునేలా చేశారు.హిందువులు సంఘటితం కావడం, సమూహంగా ఏర్పడి అధికారులపై ఒత్తిళ్లు తేవడం, ఆక్రమణలను తొలగించాల్సిందేనని పట్టుబట్టడంతో తిరిగి దేవాలయం పూజలందుకోవడం ప్రారంభమైంది.

ఈ నెల 16 న అధికారులు ఈ దేవాలయాన్ని తిరిగి తెరిచారు. దీంతో అధిక సంఖ్యలో భక్తులు శివాలయంలోకి వెళ్లి, పూజలు చేస్తున్నారు. ఈ సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక తహసీల్దారు, అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు తమ పోరాటం ఫలించిందని, హిందువులు సంఘటితమై, దేవాలయాన్ని తెరిపించుకున్నామని, ఇది హిందువుల విజయమని స్థానికులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *