హైదరాబాద్‌లో తిష్ఠ వేసిన పాక్ పౌరుడిని పంపించేసిన పోలీసులు
పాకిస్తాన్ జాతీయుడ్ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు తిరిగి పాక్ కి పంపించేశారు. పంజాబ్ లోని అటారి సరిహద్దు గుండా తిరిగి పంపించారు. పాక్ కి చెందిన మహ్మద్ ఉస్మాన్ అలియాస్ ఎండీ అబ్బాస్ అక్రం (48) 2011లో నేపాల్ ద్వారా అక్రమంగా భారత్ లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత అక్రమంగా హైదరాబాద్ నగరంలోనే వుంటూ, నేరాలు చేస్తున్నాడు. దీంతో దీనిని గుర్తించిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పోలీసులు చర్లపల్లి జైలుకు పంపించారు. శిక్ష ముగియడంతో హైదరాబాద్ పోలీసులు భారత విదేశాంగ శాఖ ద్వారా పాక్ అధికారులను సంప్రదించారు. ఆ తర్వాత న్యాయ ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ అదుపులోనే వుంచుకున్నారు. తాజాగా పాక్ విదేశాంగ శాఖ నుంచి అనుమతులు రావడంతో మహ్మద్ ఉస్మాన్ ను పాక్ రేంజర్లకు అప్పగించారు.