హైదరాబాద్ వేదికగా ”కిసాన్ ఎక్స్‌పో2024”.. ఒకే వేదికపై సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు
గ్రామ భారతి కిసాన్ ఎక్స్‌పో రెండో ఎడిషన్ కి హైదరాబాద్ మరోసారి వేదికైంది. ఈ నెల 16,17 (శని, ఆదివారాలు) తేదీల్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, మాదాపూర్ లో ఈ ఎక్స్ పో జరుగుతుంది. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ ఎక్స్‌పోను ప్రారంభించనున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొంటారు.‘‘ఆరోగ్యకరమైన ఆహారం` ఆనందకరమైన జీవితానికి అవసరం’’ అన్న నినాదంతో ఈ ఎక్స్‌పో సాగుతుంఉదని గ్రామ భారతి కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో 100కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. సంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు, గ్రామీణ ఉత్పత్తులన్నీ ఒకే వేదికపై వుండనున్నాయి. ఈ ఎక్స్‌పో ప్రత్యేకత ఇదేనని నిర్వాహకులు పేర్కొన్నారు.
రైతులు, వ్యవసాయ వ్యాపార సంస్థలు, యంత్ర పరికరాల కంపెనీలు, ఉద్యానవన, వ్యవసాయ శాఖ మరియు సీడ్ కార్పొరేషన్ అధికారులు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎక్స్‌పోలో సరికొత్త సాంకేతిక యాంత్రీకరణ పరిజ్ఞాన ఆవిష్కరణలు, వ్యవసాయం మరియు అనుబంధరంగాలైన ఉద్యానవన, డైరీ, పౌల్ట్రీ రంగాల ఉత్పత్తులకు విలువల జోడిరపు విధానాలను ఇందులో ప్రదర్శిస్తారు. వ్యవసాయ రంగంలో జాతీయ స్థాయిలో అత్యంత అనుభవజ్ఞులైన వారి ప్రసంగాలు, అనుభవాలు కూడా పంచుకోనున్నారు. దేశంలో వ్యవసాయ విధానాలు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలను కూడా వివరించనున్నారు.
మరోవైపు 9 ప్రధాన అంశాల ఆధారంగా ఈ ఎక్స్‌పో సాగుతుంది. సరికొత్త సాంకేతిక యంత్ర పరికరాలు, 100G ఎగ్జిబిటర్లు, 100G రైతు సంఘాలు, బీ2బీ సమావేశాలు, స్టాల్స్ ద్వారా ప్రత్యక్ష ప్రదర్శనలు, వ్యవసాయ ఉత్పత్తులకు విలువల జోడిరపు, రైతులకు మార్కెట్‌ను పరిచయం చేయడం, జాతీయ స్థాయి వక్తల సందేశాలతో ఈ ఎక్స్‌పో సాగుతుంది. మరిన్ని వివరాలకు 9182544256 నెంబరులో సంప్రదించవచ్చు.