హైదరాబాద్ లోనే రఫేల్ తయారీ

ఆత్మ నిర్భర భారత్ విషయంలో మరో కీలక అడుగు పడింది. రఫేల్ యుద్ధ విమానాల్లో కీలక భాగమైన ఫ్యూజ్ లేజ్ ఇకపై మన దేశంలోనే, అందులోనూ హైదరాబాద్ లోనే తయారు కానుంది. దీనిపై ఫ్రెంచి సంస్థ దసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ తో భాగస్వామ్య ఒప్పందం కూడా కుదిరింది. దీని ప్రకారం రఫేల్ ఫ్యూజ్ లేజ్ తయారీకి టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ హైదరాబాదులో అత్యాధునిక యూటిన్ ను ఏర్పాటు చేస్తుంది.
ఈ యూనిట్లలోనే ఫ్యూజ్ లేజ్ కి సంబంధించిన స్ట్రక్చరల్ సెక్షన్లు, రియల్ ఫ్యూజ్ లేజ్ లేటరల్ షెల్స్, రియాక్షన్ సెక్షన్, సెంట్రల్ ఫ్యూజ్ లేజ్, ఫ్రంట్ సెక్షన్ తయారు చేస్తారు. ఫ్రాన్స్ కాకుండా తొలిసారి రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజిలేజ్ లు హైదరాబాద్ లోనే కావడం విశేషం. రెక్కలు, వెనుక భాగం మినమా విమానంోని ఇతర భాగాన్ని ఫ్యూజిలేజ్ అంటాం. ఇందులో ప్రయాణికులు, సరుకులు, ఇతర పరికరాల రవాణా కోసం ఏర్పాట్లు చేయబడి వుంటాయి.
ఫ్యూజ్ లేజ్ అనేది విమానంలో మెయిన్ బాడీ. నెలకు రెండు ఫ్యూజ్ లేజ్ ను తయారు చేయగల సామర్థ్యం ఈ యూనిట్ కి వుంటుంది. దీని నుంచి మొదటి ఫ్యూజ్ లేజ్ సెక్షన్లు 2028లో అందుబాటులోకి వస్తాయి. అలాగే ఈ ఒప్పందం వల్ల స్థానికంగా విమాన తయారీ పరిశ్రమ విస్తరించేందుకు దేశీయ సంస్థలు అత్యాధునిక తయారీ సామర్ధ్యాన్ని పెంచుకునే అవకాశం కూడా వుంది.
RADEL2
2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించాలని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం అవసరమైన ఏర్పాట్లను సంస్థ వేగవంతం చేయనుంది. ఈ సందర్భంగా డసో ఏవియేషన్ ఛైర్మన్ అండ్ సీఈవో ఎరిక్‌ ట్రాపియర్‌ మాట్లాడుతూ, “భారత్‌లో మా కార్యకలాపాలను మరింత విస్తరించడంలో ఇది ఒక నిర్ణయాత్మక ముందడుగు. భారత రక్షణ రంగానికి మా సేవలను అందించే అవకాశాన్ని మరింతగా పెంచుతున్నందుకు సంతోషిస్తున్నాం. ఈ నిర్ణయం ద్వారా నాణ్యమైన సేవలు అందిస్తూ సైనిక అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది” అని తెలిపారు.
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్) సీఎండీ సుకరణ్ సింగ్‌ ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. “భారత రక్షణ రంగ చరిత్రలో ఇది ఒక మైలురాయి వంటిది. డసో ఏవియేషన్‌తో కుదిరిన ఈ ఒప్పందం, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ తయారీ నైపుణ్యాలను, సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి తెలియజేస్తుంది. భారతదేశ వైమానిక, రక్షణ వ్యవస్థల అభివృద్ధిలో ఇది ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *