నుహ్‌లో హిందువులపై మరో దాడి
హర్యానాలోని నుహ్‌లో హిందువులపై మరోసారి దాడి జరిగింది. మదర్సాకు చెందిన పిల్లలు రాళ్లతో దాడి చేయడంతో హిందూ భక్తులు, మహిళలు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక మసీదు సమీపంలో ‘కువాన్ (బావి) పూజ’ కోసం కొంతమంది మహిళలు వెళ్తున్నారు. మదర్సా సమీపంలోకి రాగానే కొందరు మదర్సాకు చెందిన చిన్నారులు హిందువులపై వారిపై రాళ్లు రువ్వారు. కొద్దిసేపటికే ఇరు వర్గాల ప్రజలు అక్కడ గుమిగూడడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడిరది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిని నియంత్రించారు.
ఈ ఘటనలో పలువురు మహిళలు గాయ పడగా వారిని చికిత్స నిమిత్తం నుహ్ సీహెచ్‌సీలో చేర్చారు. ఈ ఏడాదిలో హిందువులపై దాడి జరగడం ఇది రెండో సారి. అంతకుముందు, ఈ ఏడాది జూలై 31న విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన జలాభిషేక యాత్రలో నుప్‌ాలో హింస చెలరేగింది.
నల్హర్ ఆలయంలో కనీసం 2,000 మంది మహిళలు, పిల్లలు ఆశ్రయం పొందారు. ఈ హింసాకాండలో అనుమానితులలో ఒకరిగా ఉన్న ఫిరోజ్‌పూర్ జిర్కా కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ ఘర్షణలను ప్రేరేపించడంలో, తప్పుదోవ పట్టించడం, ఇతరులను ప్రేరేపించడానికి సోషల్ మీడియా మాద్యామాలను వినియోస్తున్నడన్న ఆరోపణపై అతన్ని సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు.