‌ప్రజలు ఒక అద్భుత వస్తువు

ఈ యుగంలో భగవంతుడు మానవుల్ని ఒక అద్భుత వస్తువుగా రూపొందించాడు. మనకు రెండు బలమైన కాళ్ళను ఇచ్చాడు. అయితే కనీసం నలభై, యాభై మైళ్ళు కూడా నడవడానికి ఇష్టపడం. మనకు రెండు చేతులనిచ్చాడు. కానీ వాటిని ఉపయోగించడానికి మనం సిగ్గుపడతాం. మనకు భగవంతుడు బలమైన శరీరాన్నిచ్చాడు. అయినా మనం కష్టపడటానికి ఇష్టపడం. మనం ఏమీ చేయలేని అకర్మణ్యులుగా తయారయ్యాం. మనం జన్మించింది ఉష్ణదేశంలో అయినా ఎండ అంటే భయపడతాం. వేసవికాలంలో చెమటలు కారుస్తూ నిట్టూర్పులు వదులుతుంటాం.

‘మనం మనుష్యాకారంలో ఉన్న పశువులం కాదు. పశువుల కంటే ఉన్నతమైన వారం. బుద్ధి కల్గి ఉన్నా, మనము ఉపయోగించు కోవటం లేదు. సుఖాలకు, విలాసాలకు అలవాటుపడి మన శక్తిని మరచిపోయి కూర్చు న్నాము.

– నేతాజి సుభాష్‌ ‌చంద్రబోస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *