ప్రపంచానికి మేలు భారత్ కరోనా టీకాలు
‘సర్వేసంతు నిరామయా’ – జీవకోటి అంతా రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని భారత్ కోరుకుంటుంది. అటువంటి ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని తయారుచేయడం కోసం ప్రాచీన ఆయుర్వేద విద్యను అందించిన భారత్ ఇప్పుడు ఏడాదిగా గడగడలాడిస్తున్న కోవిడ్19 మహమ్మా రికి కూడా మందును కనిపెట్టింది. అమెరికా, బ్రిటన్ మొదలైన ‘అభివృద్ధి చెందిన’ దేశాలు సాధించలేని ఘనత భారత్ సాధించింది. ఒకటికాదు ఏకంగా రెండు టీకాలను ప్రపంచానికి అందించింది. ఇంత తక్కువ కాలంలో ఒకేసారి రెండు టీకాలను అందించడం ఒక అద్భుతమని ప్రపంచ శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకుంటోంది.
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయంగా హైదారాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ, ఐసీఎంఆర్, పూణే ఎన్ఐవీ సహాకారంతో కోవాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. అయితే ఈ కోవాక్సిన్ టీకాకు ఔషద నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతినిచ్చింది. ఈ టీకా భద్రమైనదని ఇప్పటికే నిరూపితమైందని డీ.సీ.జీ.ఐ వెల్లడించింది. అలాగే ఆక్స్ఫర్డ్ ఆస్టావెనెకా సౌజన్యంతో భారత్‌లో సీరం ఇన్ట్సిట్యూట్ అభివృద్ధి చేసిన విషీల్డ్ టీకాను కూడా అత్యవసర వినియోగానికి డీ.సీ.జీ.ఐ ఆమోదం తెలిపింది. కరోనా మొదటి కేసు నమోదయిన తర్వాత సరిగ్గా 342 రోజులకు టీకా అందుబాటు లోకి రావడం దేశం గర్వించదగ్గ విషయం. ఈ టీకాను జనవరి 16 నుంచి మొదటి దశలో కరోనా వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు ఇవ్వనున్నారు.
ఆత్మనిర్భర్ భారత్ కల సాకరం దిశగా టీకా తయారు : ప్రదాని మోడీ
ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసేందుకు భారత శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారనడానికి దేశంలో రెండు టీకాలకు డీ.సీ.జీ.ఐ అనుమతి ఇవ్వడమే నిదర్శమని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. జనవరి 16 నుంచి టీకా వితరణ ప్రారంభమవు తుందని, డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలకు ఉచితంగానే అందజేస్తామని ప్రకటించారు. డీ.సీ.జీ.ఐ తీసుకున్న ఈ నిర్ణయం భారత్ ఆరోగ్యవంతమైన కోవిడ్ రహిత దేశంగా మార్చేందుకు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి నిరంతరం కృషి చేసిన వైద్య సిబ్బందికి, పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు, ఇతర కరోనా వారియర్స్‌కు ఈ సందర్భంగా మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 1 కోటి 11 లక్షల కోవిషీల్డ్ టీకాలకు ఆర్డర్ పెట్టింది. దీనితోపాటు అనేక దేశాలు కూడా టీకాలను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నాయి.
కరోనా కట్టడికి భారత్ నిర్ణయం దోహదం : డబ్య్లూహెచ్‌వో
భారత్‌లో తయారు చేసిన టీకాలకు అనుమతినిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని డబ్య్లూహెచ్‌వో స్వాగతించింది. కరోనాపై చేస్తున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు కరోనా కట్టడికి ఈ నిర్ణయం దోహదపడుతుందని డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా వ్యవహారాల ప్రతినిధి పునమ్ కేత్రపాల్ సింగ్ అన్నారు.
టీకాను వ్యతిరేకిస్తున్న ఛాందసవాదులు
ఇదిలా ఉంటే ఇస్లామిక్ అతివాదులు కొందరు మాత్రం కోవిడ్-19 వ్యాక్సిన్లను బహిష్కరిస్తామంటూ జారీ చేస్తున్నారు. ఇందుకు కారణం వాక్సిన్లు ‘హలాల్’ పద్ధతిలో తయారుచేయకపోవడమేనట!
డిసెంబర్ 20న ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన కథనం ప్రకారం, కరోనా వాక్సిన్ ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి, రవాణా సమయంలో సురక్షితంగా ఉండాలంటే వాక్సిన్ తయారీలో పంది మాంసం నుంచి ఉత్పన్నమయ్యే జెలటిన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే జెలటిన్ రహిత వ్యాక్సిన్లను తయారు చేయాలని హలాల్ సర్టిఫికేషన్ సంస్థలు స్వీట్జర్లాండ్కు చెందిన నోవార్టిన్ వంటి కొన్ని ఫార్మా కంపెనీలపై ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా, మలేషియా వంటి ఇస్లామిక్ దేశాల్లో ఉన్న ఎజె ఫార్మా ప్రస్తుతం హలాల్ వ్యాక్సిన్ల తయారీపై దృష్టిపెట్టింది.
బ్రిటిష్ ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ తన పరిశోధనలో పంది మాంసం నుంచి ఉత్పన్నమయ్యే జెలటిన్ లేకుండా వ్యాక్సిన్ తయారు చేస్తే వాటి డిమాండ్, నిలువ ఉండే కాలం తక్కువగా ఉంటుందని వెల్లడించింది.
ఈ ఏడాది అక్టోబర్‌లో ఇండోనేషియా దౌత్యవేత్తలు, ముస్లిం మతాధికారులు చైనాలో పంది మాంసం వడ్డిస్తుండటంతో విమానంలో నుంచి దిగిపోయారు. కోవిడ్ -19 టీకాలు ఇండోనేషియా పౌరులకు చేరేలా ఒప్పందాలను చేసుకోవడానికి మలేషియా దౌత్యవేత్తలు చైనాకు వెళ్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. షరియాత్ చట్టాలకు అనుగుణంగా హలాల్ చేసిన వాక్సిన్లను తయారు చేయాలని ఇస్లామిక్ మతాధికారుల నుండి తీవ్రమైన డిమాండ్ ఎదురవుతోంది.
ప్రపంచం మొత్తంలో అన్ని ఇస్లామేతర దేశాల్లోని ఔషధ కంపెనీలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడానికి పోటీ పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన మహమ్మారిని ఎదుర్కొవడానికి ఎంతో మంది కృషి చేస్తున్నారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ వల్ల ఎంతో మంది ఉపాధి కొల్పొయి నిరద్యోగులుగా మారారు. ఇంతటి విపత్కర పరిస్థితి నుంచి బయటకు రావడానికి ఎంతో మంది శాస్త్రవేత్తలు కృషి చేస్తుంటే మరో వైపు ఇస్లామిక్ మతాధికారులు హలాల్ కానందున టీకాలను బహిష్కరిస్తామని బెదిరించడం గమనార్హం.