వ్య‌వ‌సాయ చ‌ట్టాలు – నిజా నిజాలు

దేశంలోని రైతుల సంక్షేమం కోసం బీజేపీ ప్ర‌భుత్వం మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చింది. గ‌తంలో అనేక ర‌కాల ఇబ్బందుల‌కు గురైన రైతుల‌కు ఈ వ్య‌వసాయ చ‌ట్టాలు ఎంత‌గానో దొహ‌ద‌ప‌డ‌తాయి. ఎంతో మంది రైతులు ఈ చ‌ట్టాలతో ల‌బ్ది పొందుతున్నారు. అయితే కొన్ని రోజులుగా ఈ చట్టలపై కేవలం పంజాబ్ కు చెందిన కొందరు రైతులు మాత్రం తీవ్ర అభ్యంతరాలు తెలుపుతున్నారు. చట్టాలను వెంటనే రద్దు చేయాలంటూ డిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. ఇంతకీ ఈ ఆందోళనకారుల అభ్యంతరాలు ఏమిటి? అసలివి రైతు ఆందోళనలెనా? రైతుల పేరుతో కొందరు అరాచకత్వానికి పాల్పడుతున్నారా?  ప్రచారంలో ఉన్న అనేక విషయాల వెనుక నిజానిజాలు ఏమిటి?

క‌‌థ‌నం 1 :
ఢిల్లీలో జరుగుతున్నవి రైతుల ఆందోళ‌నలు.

యదార్ధం :  దేశంలో అన్నిరాష్ర్ర్టాల్లో రైతులుండగా ఒక్క పంజాబ్ రైతులకే రైతుల చట్టం ఇబ్బంది కలిగిస్తుందా?  లేక పంజాబ్ లోని వారే  రైతులా ఇక దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వారు రైతులు కాదా?

క‌థ‌నం 2 :
ప్రభుత్వం  MSP (కనీస మద్దతు ధర)ని  తీసివేస్తుంది.
యదార్ధం : చట్టంలో MSP (కనీస మద్దతు ధర) ని గురించి ప్రస్తావించడమే కాకుండా, ప్రధాని తన అనేక ప్రసంగాల్లో క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర‌ను తీసివేయబోమ‌ని చెప్పారు. రైతుల వద్ద కొన్న ధాన్యానికి  కనీస మద్దతు ధర ప్రకారం 3 రోజుల్లో చెల్లింపులు చేయబడతాయ‌ని చాలా సార్లు చెప్పారు. ఈ విషయాన్ని ప్రస్తావించకుండా కనీస మద్దతు ధరని ప్రభుత్వం తీసి వేస్తుంది అనడం నకిలీ కథనమే అవుతోంది. రైతులు తమ ఉత్పత్తిని ఎక్కడైనా అమ్ముకోవచ్చు, మండీలలోనే అమ్మాలనే నిబంధనలేదు. రైతుకు ఎక్కడా మద్దతు ధర రాకపోతే ప్రభుత్వమే కనీస మద్దతు ధర ఇచ్చి ఉత్పత్తులను కొంటుంది. ఇప్పటి వరకు రైతులు మండీలనే చట్రంలో బిగించబడి దళారుల దోపిడీకి గురై తాము పండించిన పంటకు సరైన ధర రాక నష్టపోతూ ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి.

కథనం : 3
కార్పొరేట్ కంపెనీలతో, మార్కెట్‌తో రైతులు ఒప్పందం కుదుర్చుకుంటే, రైతులు నష్టపోతారు. వారు తమ ధరను నిర్ణయించుకోలేక పోతారు. ఇందువలన పెద్ద పెద్ద కంపెనీలకు లాభం చేకూరుతుంది.
యదార్ధం :  ఒప్పందం చేసుకోవడం, చేసుకోకపోవడం అనేది రైతు ఇష్ట‌ప్ర‌కారం ఉంటుంది.  అంత‌కు ముందున్న చట్టంలో  మీరు మండీల్లోనే మీ ఉత్పత్తులను అమ్మాలనడం రైతుల గొంతు నొక్కడమే. మండీల్లోని దళారులు వారి ఇష్టప్రకారం ధర నిర్ణయించి రైతులను దోచుకోవడం ఇప్పటి వరకూ జరుగుతున్నమోసం. అంతే కాకుండా పంజాబ్ లో మండీలు కాంగ్రెసు, అకాలీదళ్ చేతుల్లో ఉన్నాయి. వారి ఇష్ట ప్రకారం రైతులను ఇప్పటివరకూ దోచుకుంటూ వచ్చారు. ఇప్పుడు తెచ్చిన చట్టం ద్వారా రైతు స్వతంత్రుడ‌వుతాడు.  దీనివల్ల ఇకనుండి రైతును కాంగ్రెసు దళారులు దోచుకోవడం కుదరదు.  అనేక ఇతర రాష్ట్రాలలో కూడా మండీలు కాంగ్రెసీల చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పడున్న చట్టంలో తను పండించిన పంటకు ధరను నిర్ణయించుకోవడం రైతుల చేతులలో ఉంటుంది. ఒక కార్పొరేట్ కంపెనీకి తాను తయారు చేసిన ఉత్పత్తి ధర తానే నిర్ణయించుకునే అధికారం ఉంది.  ఎక్కడా సరైన ధర రాకపోతే ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇచ్చి రైతుల ఉత్పత్తిని కొంటుంది. కాబట్టి రైతులు కార్పొరేట్ల చేతుల్లో బందీ అవుతాడు అనడం సత్యదూరమే అవుతుంది.

ఉదా :  టమేటాలు రైతు దగ్గర రూ.10 కి  కొని మార్కెట్టులో రూ.50 అమ్ముతున్నారు.  ఈ తేడా రూ.40 ఎవరు తింటున్నారు.  ఈ దళారీ వ్యవస్థ నిర్వీర్యం అయితే అవే టమేటాలు 20 రూపాయలకో 25 రూపాయలకో అమ్మబడతాయి. ఇది అటు రైతుకూ ఆదాయం, కొనే వినియోగదారుడికీ ఆదాయం. రిలయన్స్ ఎక్కువ ధర ఇస్తే సరుకు రిలయన్సుకు అమ్ముతాడు, బిర్లా ఎక్కువధర ఇస్తే బిర్లాకు అమ్ముతాడు, మండీలో ఎక్కువ ధర వస్తే మండీలో అమ్ముతాడు. లేదా మార్కెట్ లో ఎక్కువ ధర లభింస్తే మార్కెట్లో అమ్ముతాడు ఈ స్వాతంత్ర్యం ఇప్పుడు రైతుకు వచ్చింది. ఇక రైతు దళారులపైన ఆధారపడాల్సిన పని ఉండదు.

కథనం 4 :  మండీలు మూతబడతాయి.
యదార్ధం: గ‌త కొన్నేండ్లుగా దేశంలో రేషను షాపులు, పెట్రోలు పంపులు, మండీలన్నింటినీ కంట్రోలు చేస్తున్నది, మండీల్లో వ్యాపారం చేస్తున్న‌వారంద‌రూ కాంగ్రెస్ వారే. పంజాబ్ లో కాంగ్రెస్, అకాలీదళ్ వీరి చేతుల్లోనే మండీలన్నీ ఉన్నాయి.  ఇవి మూతబడితే లేదా రైతు స్వతంత్రుడైతే నష్టపోయేది వీరే. అయినా మండీలు ఎక్కడా మూతబడవు. రైతుకు బయట అంటే కార్పొరేట్లలో, లేదా మార్కెట్లో సరైన ధర లభించకపోతే వారు మండీలలోనే కనీస మద్దతు ధరకు  అమ్ముతారు. దీని వల్ల కాంగ్రెసీల మోనోపలి పోతుంది. కలిస్థానీల మోనోపలీ పోతుంది. వారి కమీషన్లు పోతాయి ఇదీ అసలు కథ.

క‌థ‌నం 5 :
కార్పొరేట్లు ఎక్కువ సరుకు కొని గోదాములలో దాచుకుని ఎక్కువ ధరలకు అమ్ముతారు. బ్లాక్ మార్కెట్ పెరిగిపోతుంది.
యదార్ధం:   బ్లాక్ మార్కెట్ ఎక్కువ యు.పి.ఎ ప్రభుత్వంలోనే జరిగింది. పప్పుల ధరలు ఆకాశాన్ని అంటిన రోజులున్నాయి. చక్కెర ధరలు చుక్కలు చూపించాయి. ఉల్లిధర కన్నీళ్ళు తెప్పించింది. గత ఆరు సంవత్సరాల కాలంలో ధరలు స్వల్పంగా పెరిగాయే తప్ప యు.పీ.ఏ కాలం లో ఉన్నంతగా పెరగలేదు. శరద్ పవార్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చక్కెరె ధర పెరగవచ్చు అని ప్రకటన ఇచ్చేవాడు. ఇక వ్యాపారులందరూ చక్కెర నిల్వలు పెంచుకునేవారు.  పప్పుల ధర పెరగవచ్చని ప్రకటన చేయగానే బజారులోని పప్పులన్నీ మాయం అయ్యేవి. ఇలా దళారులు, వ్యాపారులు ప్రజలను, వ్యవసాయదారులను దోచుకున్నారు. ఇప్పుడు అలా జరిగే అవకాశం లేదు కనుక కాంగ్రెసీల వ్యాపారాలు దెబ్బతింటాయి. బ్లాక్ మార్కెట్ కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ జరిగింది తప్ప మోడీ ప్రభుత్వం వచ్చిన బ్లాక్ మార్కెట్‌కు ఎక్క‌వ అవ‌కాశం లేకుండా పోయింది. అందుకనే ఈ ఆరు సంవత్సరాలు ధరలు చాలా తక్కువ హెచ్చు తగ్గులతో నడిచాయి, నడుస్తున్నాయి.

సరే ఇప్పుడు రైతుల పేరుతో జరుగుతున్న ఈ ఆందోళనలో ఖలిస్థాన్ జెండాలు ఎందుకు కనిపిస్తున్నాయి. ఈ ఆందోళన రైతులే చేస్తుంటే పెద్ద పెద్ద కార్లు ఈ ప్రదర్శలో ఎందుకు కనిపిస్తున్నాయి. ఈ ప్రదర్శనకు నిధులు ఎవ‌రు స‌మ‌కూరుస్తున్నారు. ముస్లీంలు సిక్కువేషాలు వేసుకుని ఈ ప్రదర్శనలో ఎందుకు పాల్గొంటున్నారు అనేవి ప్రశ్నలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *