సమాజ సేవే స్వయంసేవకత్వం

నారాయణ్‌ ‌దభద్కర్‌ 85 ‌సంవత్సరాల ఒక ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌స్వయంసేవక్‌. ‌నాగపూర్‌కి చెందిన ఈయన ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆస్పత్రిలో ఉన్న సమయంలో తీసుకున్న ఒక నిర్ణయం ఆయనలో స్వయంసేవకత్వాన్ని చాటిచెప్పింది.

కోవిడ్‌ ‌రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటీవల ఆయన కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన కుమార్తె ఎంతో ప్రయత్నంతో తెలిసిన వారి ఆస్పత్రిలో ఆయనకు ఒక పడకను ఏర్పాటు చేయగలిగారు. అప్పటికే ఆయనకు ఆక్సిజన్‌ ‌లెవెల్స్ ‌తగ్గుతూ ఉన్నాయి.

తర్వాత రోజు ఆయన తన మనవరాలితో కలిసి ఆస్పత్రికి వెళ్లారు. అప్పటికి దభద్కర్‌ ఊపిరి అందక ఇబ్బంది పడుతూనే ఉన్నారు. తన మనవరాలు ఆస్పత్రి అడ్మిషన్‌ ‌గురించిన ఫార్మాలిటీస్‌ ‌పూర్తి చేస్తున్న తరుణంలో అక్కడ ఒక మహిళ నలభై సంవత్సరాల తన భర్తకు ఆస్పత్రిలో అడ్మిషన్‌ ‌కావాలని కోరుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉండడం దభద్కర్‌ ‌కంటపడింది.

  ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆస్పత్రి సిబ్బందిని పిలిచి తనకు బదులుగా ఆ 40 సంవత్సరాల వ్యక్తికి ఆస్పత్రిలో పడకను సమకూర్చవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వారించబోయిన వారితో ‘‘నా వయసు 85 సంవత్సరాలు. నేను సంపూర్ణ జీవితాన్ని చూశాను. నాకే ఇబ్బందీ లేదు. కానీ ఆ అబ్బాయికి ఎంతో భవిష్యత్తు ఉంది. అతడి పిల్లలకి అతని అవసరం ఉంది. నాకేమైనా ఫర్లేదు. అతను బ్రతకాలి.’’ అని చెప్పి ఆస్పత్రి సిబ్బందిని, తన మనుమరాలిని ఒప్పించారు. తరువాత ఇంటికి వెళ్లిపోయారు. మూడు రోజుల తర్వాత దభద్కర్‌ అం‌తిమ శ్వాస విడిచారు. తను పోతూపోతూ ‘‘ఒక స్వయంసేవక్‌ ఎప్పుడూ తన కోసం కాక తన చుట్టూ ఉన్న వారి కోసమే ఆలోచిస్తాడు’’ అనే సత్యాన్ని మరోసారి నిరూపించి దిగంతాలకు ఎగసిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *