సామలు

ఉపయోగాలు

–              సామలుతో చేసిన అన్నం చమురు కలిగి మృదువుగా, తియ్యగా, వగరుగా ఉండును.

–              సామలతో జావ, సామల పిండితో రొట్టెలు వంటి వంటకాలను కూడా తయారు చేసుకుంటారు

–              వీటిలో అధిక పీచు పదార్థం వలన మలబద్ధకాన్ని అరికడుతుంది.

–              శరీరము నందు కఫమును, పైత్యమును హరించును.

–              ఈ బియ్యముతో పరమాన్నం చేసిన అద్భుతమైన రుచితో ఉండును.

–              పైత్యం ఎక్కువవడం వల్ల భోజనం తరువాత గుండెల్లో మంటగా ఉండటం, పుల్ల తేన్పులు,  కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దివ్య ఔషధం.

–              కీళ్లనొప్పులు, ఊబకయం మరియు ఆర్థరైటిస్‌ ‌సమస్యతో ఇబ్బంది పడేవారికి మంచి ఔషధం.

–              సామల్లో 7.7 గ్రాముల ప్రోటీన్లు, 5.2 గ్రాముల కొవ్వు పదార్థాలు, 7.6 గ్రాముల ఫైబర్‌, 1.5 ‌గ్రాముల మినరల్స్, 9.3 ‌మిల్లీ గ్రాముల ఇనుము, 17 మిల్లీగ్రాముల కాల్షియం, 207 కేలరీల శక్తి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *