జమ్మూ కశ్మీర్‌లో యాత్రీకుల బస్సు పై ఇస్లామిక్ ఉగ్రవాదుల కాల్పులు.. 10మంది దుర్మరణం
జమ్మూ కశ్మీర్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. యాత్రికుల బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పది మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్పులు చేయడంతో ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి, లోయలో పడిపోయింది. బస్సు శివఖోడా ఆలయం నుంచి కత్రాకి తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల కారణంగా డ్రైవర్‌కి బస్సుపై కంట్రోల్ తప్పిందని, దీంతో లోయలో పడిపోయిందని ఎస్పీ తెలిపారు. సమాచారం అందుకోగానే భద్రతా బలగాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, సహాయ చర్యలు చేపట్టారు.