సుక్మాలో 18 మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టులకు ప్రాబల్యం వున్న ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో వారికి ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా పోలీసుల ఎదుట 18 మంది మావోయిస్టులు మంగళవారం లొంగిపోయారు. వారిలో దాదాపు 10 మందిపై 38 లక్షల రివార్డు కూడా వుంది. వీరంతా సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం నక్సల్స్ భావజాలం పనిచేయడం లేదని, ఆ భావజాలం పేరుతో నక్సల్స్ ఇన్ని సంవత్సరాలుగా స్థానిక గిరిజనులను హింసిస్తున్నారని,దోపిడీ చేస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు.
PLGA సభ్యులు అయిన మడ్కం అయితా (25), మరియు భాస్కర్ అలియాస్ భోగం లక్కా (26) తలపై ఒక్కొక్కరికి రూ. 8 లక్షల రివార్డులు ఉన్నాయి.మద్కం కమ్లు మరియు మద్వి చన్ను అనే మరో ఇద్దరు మావోయిస్టులపై ఒక్కొక్కరికి రూ. 5 లక్షల రివార్డులు, లొంగిపోయిన మరో ఆరుగురు ఉగ్రవాదులపై ఒక్కొక్కరికి రూ. 2 లక్షల రివార్డులు ఉన్నాయి.
మరోవైపు లొంగిపోయిన నక్సలైట్లకు ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి 50,000 రూపాయల సహాయం అందిస్తున్నారు. తిరిగి జన జీవన స్రవంతిలో కలిసి, జీవితాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం కోరింది.కొన్ని రోజుల క్రిందటే ఛత్తీస్ గఢ్ లో మావోలకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరికొంత మందికి గాయాలు కూడా అయినట్లు సమాచారం.
ఈ ఆపరేషన్‌లో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ DRG బలగాలు భారీగా పాల్గొన్నాయి. కాగా, ఇవాళ ఉదయం నుంచీ భద్రతా బలగాలు, నక్సల్స్‌కి మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ ను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధ్రువీకరించారు.అయితే.. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టుల అగ్రనేతలు కూడా మరణించాడు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా కేశవరావు వున్నాడు. అలాగే కేశవరావుపై కోటిన్నర రివార్డు కూడా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *