2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహితంగా భారత్ : అమిత్ షా

ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్లలో 22 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఒకే రోజు బీజాపూర్, కాంకెర్ జిల్లాల్లో వేర్వేరుగా ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ కాల్పుల్లో 22 మంది నక్సలైట్లు హతమయ్యారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. భారత్ ను నక్సల్స్ రహిత దేశంగా మార్చేందుకు చేపట్టిన ఆపరేషన్ లో ఇది మరో పెద్ద విజయమని అభివర్ణించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తోందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా దేశంగా మారుతుందని అమిత్ షా కీలక ప్రకటన చేశారు. అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నా.. కొందరు నక్సలైట్లు లొంగిపోవడం లేదని, అలాంటి వారి పట్ల తమ ప్రభుత్వం కఠిన వైఖరితో వుందన్నారు. సైనికులు నక్సల్స్ ముక్త్ భారత్ అభియాన్ దిశలో మరో వియాన్ని సాధించారన్నారు. బీజాపూర్, కాంకెర్ లో భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లు హత్యమయ్యారని అమిత్ షా ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *