”లాహోర్ డిక్లరేషన్’’ ని కావాలనే ఉల్లంఘించాం : తప్పు ఒప్పేసుకున్న పాక్
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తాను చేసిన తప్పును ఒప్పేసుకున్నారు. 1999లో పాకిస్థాన్‌కి, అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ మధ్య జరిగిన ”లాహోర్ డిక్లరేషన్’’ ని తాము ఉల్లంఘించామని ఉప్పేసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే తాము తుంగలో తొక్కామని తేల్చి చెప్పేశారు. ఆ ఒప్పందాన్ని అప్పటి అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ తొక్కేశారని కుండబద్దలు కొట్టారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్రమ చొరబాట్లు కూడా పెరిగాయన్నారు.
1998 మే 28 న తాము ఐదు అణు పరీక్షలు నిర్వహించామని, దాంతో వాజ్ పాయ్ తమ దేశానికి వచ్చి శాంతి ఒప్పందం చేసుకున్నట్లు గుర్తు చేశారు. కానీ… ఒప్పందం జరిగింది కానీ… తామే ఉద్దేశపూర్వకంగా తొక్కేశామన్నారు. ఇది పూర్తిగా తమ తప్పేనని ఒప్పేసుకున్నారు. ఈ తీర్మానం జరిగిన కొన్ని రోజులకే పాక్ దళాలు కాశ్మీర్‌లోకి చొరబడటం, భారత సైన్యం వారిని అడ్డుకోవడం, అది కాస్త యుద్ధానికి దారి తీసిందన్నారు. పాకిస్తాన్ ముస్లింలీగ్ నవాజ్ అధ్యక్షుడిగా నవాజ్ షరీఫ్ మంగళవారం తిరిగి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సర్వసభ్య సమావేశంలో పై వ్యాఖ్యలు చేశారు.