విజయవాడలో 31 మంది నక్సలైట్ల అరెస్ట్..

విజయవాడలో ఒక్కసారిగా కలకలం రేగింది. నగర శివారులోని కానూరు న్యూ ఆటోనగర్ లో 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం హిడ్మాతో సహా ఆరుగురు నక్సల్స్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో కేంద్ర బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. అయితే న్యూ ఆటోనగర్ లో ఓ భవనాన్ని షెల్టర్ గా చేసుకొని మావోయిస్టులు నివాసం వుంటున్నట్లు కీలక సమాచారం అందింది. దీంతో పోలీసులు మొత్తం 27 మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్లు సమాచారం అందింది. భారీగా ఆయుధాలను కూడా డంప్ చేసినట్లు గుర్తించారు. మొత్తం 31 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో అక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు.. మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో 21 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నట్టు సమాచారం. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో దొరికిన డెయిరీలో వీరి సమాచారం లభించింది. దాని ఆధారంగానే పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వీరందరికీ ఓ మహిళ షెల్టర్ ఇస్తున్నట్లు తెలిసింది. వీరందరినీ అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించినట్టు సమాచారం. కాగా.. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కూంబింగ్ చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు అడవులను వదిలి నగరంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.
కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఏడీజీ మహేశ్ చంద్ర లడ్హా ప్రకటించారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులున్నారని, వారి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గత రెండు రోజులుగా ఇంటెలిజెన్స్ సమాచారంతో గాలింపు చర్యలు విస్తృతంగా చేశామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *