దేశంలో సేంద్రీయ వ్యవసాయం పెంచడానికి కేంద్ర ప్రభుత్వ పథకాలివీ
భారత వ్యవసాయ రంగంలో పరిస్థితులు మారిపోతున్నాయి. వాతావరణ పరిస్థితులు గానీ, ఖర్చులు గానీ, రసాయనాల వాడుకలు బాగా వాడటం వల్ల దిగుబడి కూడా తగ్గిపోతోంది. దీంతో చాలా మంది సేంద్రీయ వ్యవసాయం వైపు వస్తున్నారు. లక్షలు సంపాదిస్తూ… విజయ పథంలో నడుస్తున్నారు. 2014 లో సేంద్రీయ వ్యవసాయం 11.83 లక్షల హెక్టార్లలో వుంటే… 2020 నాటికి ఇది 29.17 లక్షల హెక్టార్లలో సేంద్రీయ వ్యవసాయం పెరిగింది.
కేంద్ర ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయంపై పెట్టిన దృష్టి కారణంగానే ఇది జరిగింది. దేశంలో సేంద్రీయ ఉత్పత్తుల ఎగుమతులు కూడా పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2024 నాటికి సేంద్రీయ వ్యవసాయం 20 లక్షల హెక్టార్లు అదనపు విస్తీర్ణంలో సేంద్రీయ వ్యవసాయాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రచారం, మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ సౌకర్యాలు, సేంద్రీయ ఉత్పత్తులకు ప్రీమియం ధర…. ఇలా సేంద్రీయ వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తున్నారు. దీని వల్ల కూడా సేంద్రీయ వ్యవసాయ పద్ధతిని అవలంబించడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. భారత్‌లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన పథకాల పూర్తి వివరాలివే….
1. పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై)
పార్టిసిపేటరీ గ్యారెంటీ సిస్టమ్ ధృవీకరణతో క్లస్టర్ ఆధారిత సేంద్రీయ వ్యవసాయాన్ని ఈ పథకం ప్రోత్సహిస్తుంది. క్లస్టర్ల ఏర్పాటు, శిక్షణ, ధృవీకరణ మరియు మార్కెటింగ్‌కి ఈ పథకం ఉపకరిస్తుంది. మూడు సంవత్సరాలకు గాను 50,000 రూపాయల చొప్పున సేంద్రీయ ఇన్‌పుట్లకు గాను రైతులకు ప్రోత్సాహకరంగా ఈ పథకం కింద అందిస్తారు. మెరుగైన దిగుబడి, మార్కెటింగ్ సవయం కోసం ఈ గ్రాంట్ ఇసవ్తరు. సశీంద్రీయ ఎరువులు, మంచి నాణ్యమైన విత్తనాలను ఏర్పాటు చేసఱకోవడానికి మొదటి సంవత్సరంలో 3100 రూపాయలు ఇసవ్తరు. ఇది నేరుగా బదిలీ చేసవ్తరు. మిగిలిన 8800 తదుపరి దఫాలో ఇస్తారు. దీనిని రైతులు ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, హార్వెస్టింగ్ కోసం వినియోగించుకోవచ్చు.
2.మిషన్ ఆర్గానిక్ వ్యాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్‌ఈస్ట్ రీజియన్
ఈ పథకం ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపైనే ఎక్కువ దృష్టి పెట్టేలా వుంటుంది.ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలోని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహిస్తుంది. సేంద్రీయ ఎరువులు, ఇతర అవసరాల రీత్యా రైతులకు మూడు సంవత్సరాల పాటు హెక్టారుకు 25 వేల సాయం అందిస్తారు. పంటకోతల అనంతరం మౌలిక సదుపాయాలు కూడా ఈ పథకంలో అందిస్తారు.
3. కేపిటల్ ఇన్వెస్టిమెంట్ సబ్సిడీ స్కీమ్ అండర్ సాయిల్ హెల్త్ మేనేజ్‌మెంట్ స్కీమ్
ఈ పథకం కింద యాంత్రీకరించిన పండ్లు మరియు కూరగాయల మార్కెట్ వ్యర్థాల ఏర్పాటుకు రాష్ట్ర్ర ప్రభుత్వాలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు 100కి 100 శాతం సాయం అందిస్తారు.వ్యవసాయ వ్యర్థాల కంపోస్ట్ ఉత్పత్తి యూనిట్‌కి గరిష్ట పరిమితి ఒక్కో యూనిట్‌కి 190 లక్షల చొప్పున అందిస్తారు. ఇక వ్యక్తిగతంగా, ప్రైవేట్ ఏజెన్సీలకు పెట్టుబడి ఖర్చు పద్దు కింద 33 శాతం వరకు యూనిట్‌కి 63 లక్షల వరకు సాయం అందిస్తారు.
4. నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్
ఈ మిషనÊ కింద 50 శాతం సబ్సీడీ అందిస్తారు. బయో ఎరువులు, రైజోబియం కల్చర్ సరఫరా, ఫాస్పేట్ సోలబిలైజింగ్ బాక్టీరియా (పీఎస్‌బీ), వర్మీ కంపోస్ట్‌తో సహా వివిధ వికాభాగాలకు హెక్టారుకు 300 రూపాయల చొప్పున సాయం అందిస్తారు.