50 ఆవులను నదిలోకి తోసేసిన ఆకతాయిలు.. 20 ఆవులు మృతి
మధ్యప్రదేశ్ లో ఆకతాయిలు ఘోరమైన పనికి ఒడిగట్టారు. పనిగట్టుకొని, ఉద్దేశపూర్వకంగా 50 ఆవులను నదిలో తోసేశారు. వాటిలో 20 ఆవులు మృతి చెందాయి. మధ్యప్రదేశ్ లోని బామ్ హోర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద వున్న సత్నా నదిలోకి నలుగురు ఆకయితాలు 50 ఆవులను తోసేసినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని, వివరాలు సేకరించారు. బగ్రి, రవి బగ్రి, రాంపాల్ చౌదరీ, రాజ్లు చౌదరీ అనే నిందితులను పోలీసులు గుర్తించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు మిగిలిన ఆవులను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ స్టేషన్ ఇంచార్జీ అశోక్ పాండే ప్రకటించారు. తమకు అందిన సమాచారం ప్రకారం అక్కడ సుమారు 50 ఆవుల్ని తోసేసినట్లు చెప్పారు. వాటిలో 20 ఆవులు మరణించాయని పోలీసులు తెలిపారు.