యూపీలో తిరిగి సనాతన ధర్మంలోకి 50 కుటుంబాలు

యూపీలోని లధౌలీలో 50  కుటుంబాలు తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చేశాయి. గతంలో ఈ కుటుంబాలు క్రిస్టియన్ మతంలోకి వెళ్లిపోయారు. కానీ… అక్కడి మోసాలు, మన ధర్మంలోని నిజాలను తెలుసుకొని తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేస్తున్నామని సంతోషంగా ప్రకటిస్తూ తిరిగి వచ్చారు. గార్గీ కన్యా గురుకుల్, అగ్ని సమాజ్ ఇందుకు వారికి ప్రేరణను కలిగించాయి. అలాగే సంజీవ్ నెవార్ నేతృత్వంలో ఈ ఘర్ వాపసీ సాగింది. లధౌలీలో హోమం, పూజాది కార్యక్రమాలు జరిగాయి. ఈ 50 కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొని, తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా వారందరూ ప్రతిజ్ఞ చేశారు. కులతత్వం, మాంసాహారం స్వీకరించడం, మద్యం వంటి వాటికి పూర్తిగా దూరంగా వుంటామన్నది ఆ ప్రతిజ్ఞలోని సారాంశం.వారందరూ అత్యంత శ్రద్ధా భక్తులతో అక్కడి వారు చెప్పిన సంప్రదాయాలన్నింటినీ చేశారు. దీంతో సనాతన ధర్మం పట్ల వారికున్న అంకిత భావం మరోసారి నిరూపితమైంది.ఇక.. మత మార్పిడులను నిరోధించి, సనాతన ధర్మం వైపు తిరిగి వచ్చేలా చేయడమే తమ మిషన్ లక్ష్యమని గార్గీ కన్యా గురుకుల్, అగ్ని సమాజ్ ప్రతినిధులు పేర్కొన్నారు. చాలా రోజులుగా ఇందుకు తాము శ్రమిస్తున్నామని, ఇంకా తమ ప్రయత్నాలు కొనసాగుతూనే వుంటాయన్నారు.
మరోవైపు గార్గికన్యా గురుకుల్, అగ్ని సమాజ్ ప్రతినిధులు గతంలోనూ ఈ ఘర్ వాపసీ ప్రయత్నాలు చేసి, సఫలత చెందారు. మీరట్ కేంద్రంగా 50 కుటుంబాలను తిరిగి సనాతన ధర్మంలోకి చేర్చారు. అలీఘర్ ప్రాంతంలో చాలా మత మార్పిళ్లు జరుగుతున్నాయని, అక్కడి వారిని మోసం చేస్తున్నారని సంజీవ్ నెవార్ అన్నారు.దీనికి తాము అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. అయితే కేవలం మత మార్పిళ్లను నిరోధించడమే కాకుండా హిందువులలో ఐక్యత, ఆధ్యాత్మిక పుష్టిని చేకూర్చడం కూడా తమ లక్ష్యమని, ఇందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నామని అగ్ని సమాజ్ ప్రతినిధి నెవార్ తెలిపారు. కానీ అక్రమ మత మార్పిళ్లను నిరోధించడం తమ సంస్థ ప్రథమ కర్తవ్యమన్నారు. అలాగే వైదిక విలువల సమాజంలోకి ప్రజలను తీసుకెళ్లడం, ఘర్ వాపసీ చేసిన కుటుంబాల్లో సనాతన ధర్మ విశిష్టతను తెలియజేయడం కూడా చేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *