కుంభమేళాలో 6 కోట్ల మంది పుణ్య స్నానాలు
యూపీలో మహా కుంభ అత్యంత వైభవంగా సాగుతోంది. కోట్లాది మంది ప్రజలు అక్కడికి చేరుకొని, పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. త్రివేణి సంగమంలో నాలుగు రోజుల్లోనే 6 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.45రోజులుసాగే మహా కుంభమేళాలో పాల్గొనేందుకు 50 కోట్ల మంది వరకు ప్రయాగ్‌రాజ్ వచ్చే అవకాశం ఉందని డీజీపీ ప్రశాంత్ కుమార్ అన్నారు. 20 లక్షల మంది వరకు విదేశీ యాత్రికులు ఉంటారని అంచనా వేశారు. కాగా, భారత విదేశాంగ శాఖ ఆహ్వానం మేరకు 10 దేశాలకు చెందిన 21 మందితో కూడిన అంతర్జాతీయ బృందం ప్రయాగ్‌రాజ్‌లోని తాత్కాలిక టెంట్ సిటీకి చేరుకుంది. ఈ సందర్భంగా పుణ్య స్నానాలు చేశారు. అలాగే అక్కడి సాధువులను కూడా కలుసుకుంటూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.