సనాతన ధర్మంలోకి 650 కుటుంబాలు

ఛత్తీస్ గఢ్ రాయపూర్ జిల్లాలోని శక్తి జిల్లాలో 650 మందికి పైగా తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించారు. సర్వ సనాతన హిందూ పంచాయతీ విరాట్ హిందూ సమ్మేళనంలో వీరందరూ తిరిగి హిందూ మతాన్ని స్వీకరించారు. గతంలో తామంతా క్రైస్తవ మతంలో వుండేవారమని, అసలు నిజాన్ని తెలుసుకొని, తిరిగి హిందూమతంలోకి వచ్చేసినట్లు పేర్కొన్నారు. వీరందరికీ వారి పాదాలను గంగా జలాలతో కడిగి, వారందరనీ హిందూ మతంలోకి ఆహ్వానించారు. ఈ ఘర్ వాపసీ కార్యక్రమానికి సాధు సంతులు, స్థానిక హిందువులు కూడా భారీ సంఖ్యలోనే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ శక్తి ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మతమార్పిళ్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతంలోని క్రైస్తవ మత మిషనరీలు అక్రమ మత మార్పిళ్లని బాగా ప్రోత్సహిస్తున్నాయని, ఇది జనాభా మార్పుకు కారణమవుతున్నాయని సాధువులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ పరిణామం ఎన్నికలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని, ఇది అత్యంత ఆందోళనకరమైన విషమని సాధువులు అన్నారు. నకిలీ హిందువుల వల్ల సనాతన సంస్కృతే ప్రమాదంలో పడిపోతోందన్నారు. ఈ క్రిప్టో క్రిస్టియన్లు తమను తాము హిందువులుగా చిత్రీకరించుకుంటూ మత మార్పిళ్లను చేస్తున్నారన్నారు. వీరి ముసుగులను హిందువులు విప్పాలని, వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘర్ వాపసీ విషయంలో దేశంలోని యువత కీలకంగా వుండాలని, వారి పాత్రే అధికంగా వుండాలని స్వామీజీలు పిలుపునిచ్చారు. అక్రమ మత మార్పిళ్ల ద్వార ఎదురయ్యే పరిణామాలను హిందూ సమాజం సమర్థంగా ఎదుర్కోవాలని, దీనిపై తీవ్రంగా పోరాటం చేయాలన్నారు. ఘర్ వాపసీ లాంటి కార్యక్రమాలను మరింత భారీ స్థాయిలో నిర్వహించాలన్నారు.
మరీ ముఖ్యంగా వనవాసీలు అధికంగా వున్న ప్రాంతాల్లో చట్టవిరుద్ధ మత మార్పిళ్ల విషయంలో యువకులు అత్యంత జాగరూకతతో వుండాలన్నారు. ఈ తరుచుగా వెలుగులోకి వస్తుంటాయని, ఇవి కాస్తా గొడవలకు దారితీస్తాయని, దీనిపై జాగరూకతతో వుండాలన్నారు. వెంటనే మత మార్పిడి నిరోధక చట్టాన్ని ప్రభుత్వాలు తీసుకురావాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. అక్రమంగా మతం మారి, రిజర్వేషన్లు పొందుతున్నారని, అలాంటి వారి రిజర్వేషన్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *