సనాతన ధర్మాన్ని స్వీకరించిన 70మంది గిరిజనులు

చత్తీస్ గఢ్ లోని కబీర్ ధామ్ జిల్లో 70 మంది గిరిజనులు స్వధర్మంలోకి తిరిగి వచ్చారు. మిషనరీలు చెప్పే మాటలను నమ్మి సనాతన ధర్మాన్ని వీడిన వారు, మన ధర్మ గొప్పతనాన్ని తెలుసుకున్నారు. అందుకే తిరిగి స్వధర్మంలోకి వచ్చారు
ఈసందర్భంగా మత మార్పిడిని వ్యతిరేకిస్తూ, పండరియా నియోజకవర్గం నుండి బిజెపి ఎమ్మెల్యే భావన బోహ్రా ‘ఘర్ వాపసీ వేడుక’ నిర్వహించారు. కుయ్-కుక్దూర్‌లోని స్పెషల్ బ్యాక్‌వర్డ్ ట్రైబ్ హాస్టల్ గ్రౌండ్స్‌లో సేవా దివాస్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఝూమర్, బోహిల్, అగర్పాని, న్యూర్ ,చిండిదిహ్ గ్రామాలకు చెందిన 70 మంది గిరిజనులు తిరిగి తమ మూలాలను చేరుకున్నారు. వారందిరనీ స్థానిక ఎమ్మెల్యే చాలా గౌరవంగా సనాతన ధర్మంలోకి తీసుకొచ్చారు. వారందరికీ గౌరవంగా, స్వాగతానికి గుర్తుగా ఎమ్మెల్యే వారి పాదాలను కడిగి ఆచార బద్ధంగా పూజలు నిర్వహించారు. గిరిజన వర్గాలను ఉద్ధరించడం, వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం, వారి ప్రత్యేక గుర్తింపును గౌరవించడం ,సంరక్షించడం ఈ ప్రయత్నాల లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉద్ఘాటించారు.బలవంతపు మత మార్పిడికి వ్యతిరేకంగా ఈ చర్యను ఒక వైఖరిగా పేర్కొంటూ, ఎమ్మెల్యే భావన బోహ్రా, ఘర్ వాపసీ కేవలం మతానికి సంబంధించినది కాదని; ఇది సాంస్కృతిక , ఆధ్యాత్మిక మేల్కొలుపు అని చెప్పారు.
విదేశీ నిధులతో నడిచే NGOలు, మిషనరీ సంస్థలు ప్రేరేపణలు , తప్పుడు సమాచారం ద్వారా ఆశపెడుతూ గిరిజన జనాభాను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపిస్తూ, ఎమ్మెల్యే ఇటువంటి చర్యలను గిరిజన గుర్తింపు , వారి సాంస్కృతిక వారసత్వానికి ప్రత్యక్ష ముప్పుగా పేర్కొన్నారు. ఇకనుండైనా గిరిజనులు జాగ్రత్తగా ఉండి వారి అసలు రంగను గుర్తించాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఝూమర్, బోహిల్, అగర్పాని, న్యూర్ ,చిండిదిహ్ గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *