ఏ అపచారాన్ని సహించలేదు

స్వామి వివేకానంద విద్యార్థిగా ఉన్న రోజులలో జరిగిన సంఘటన. ఒక క్రైస్తవ మత ప్రచారకుడు నడివీధిలో మన ధర్మాన్ని, దేవీ దేవతలను హేళన చేస్తూ ‘నేను మీ దేవతా విగ్రహాన్ని  కొడితే మీ దేవుడేంచేస్తాడు?’’ అని అపహస్యం చేశాడు. ఆ దారిన వెళ్తున్న నరేంద్రుడు ‘‘నేను మీ దేవుడి విగ్రహాన్ని కొడితే అప్పుడేం చేస్తాడు?’’ అని ప్రశ్నించాడు. ‘‘నీవు చనిపోయాక నిన్ను ఘోర నరకాగ్నిలో పడవేస్తాడు’’ అన్నాడు ఆ మత ప్రచారకుడు. ‘‘నీవు చనిపోయాక మా దేవుడూ నిన్ను నరకాగ్నిలో తోస్తాడు’’ అని బదులిచ్చాడు నరేంద్రుడు.  మన మతం, ధర్మం దేవీదేవతలపట్ల ఏ అపచారాన్ని సహించలేదు.

‘‘మీ విదేశీయులు మా మతానికి, దేశానికి చేసిన అపకారానికి హిందూ మహా సముద్రంలోని బురదనంతా తెచ్చి మీ ముఖాన కొట్టినా ప్రాయశ్చిత్తం జరగదు’’ అని నిర్భయంగా విశ్వమత మహాసభలో విమర్శించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *