కూకట్‌పల్లిలో ఘనంగా కుటుంబ సమ్మేళనం

లక్ష్మీ నరసింహా సేవాసమితి, కుటుంబ ప్రబోధన్‌ విభాగం కూకట్‌పల్లి జిల్లా సంయుక్తంగా 20`11`2022 ఆదివారం సాయంత్రం 5.30 గం. నుండి 8 గం.ల వరకు కుటుంబ సమ్మేళనం స్థానిక వాసవి కన్యకాపరమేశ్వరి కళ్యాణ మంటపంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వల్లూరు రామచద్రమూర్తి, సీనియర్‌ జర్నలిస్టు వల్లీశ్వర్‌, కుటుంబ ప్రబోధన్‌ తెలంగాణ ప్రాంత సంయోజక్‌ పట్లోల్ల మురళీధర రెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు  రాకాసుధాకర్‌ విచ్చేసి ప్రసంగించారు.  ప్రార్థన, ఓంకారంతో కార్యక్రమం ప్రారంభమైంది. మురళీధర్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘కుటుంబ ప్రబోధన్‌ హిందూ సంఘటన వేగాన్ని పెంచేందుకు ఉద్దే శించి ప్రారంభమైంది. ఏది జరగాలన్నా కుటుంబం అవసరం, వ్యక్తికి సమాజానికి మధ్య వారధి కుటుంబం, నరుడ్ని నారాయణుడిగా మార్చేందుకు ఉద్దేశించబడిన కుటుంబ వ్యవస్థ లక్ష్యం సాధించ గల్గుతున్నదా? అని ప్రశ్నిస్తే కొన్ని విషయాలు అవలోకించాల్సివస్తుంది. పాశ్చాత్యుల పీడనవల్ల మన కుటుంబాలు విచ్ఛిన్నమైనవి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన, నీతి, రీతి చాలా అవసరమైనవి. బ్రిటన్‌ రాణి దివంగత మార్గరెట్‌ థాచర్‌ ‘భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పది, మీరు వచ్చి మాకు సభ్యత నేర్పండి’ అన్నారు. తల్లిబడి, బడి, గుడి ఆధారంగా మన దేశంలో సంస్కృతి నిలబడిరది. చైనా రాయబారి కూడా వేల సంవత్స రాల దాడులు ఎదుర్కొన్నా భారత్‌ నిలబడిరద న్నారు. హిందూ కుటుంబ వైశిష్ట్యాన్ని నిలుపు కుందన్నారు. తాతమ్మల నానమ్మల శిక్షణ లేని కారణంగా, రామాయణం, భారత గాధలని పిల్లలకు చెప్పని కారణంగా ధైర్య సాహసాలు చెప్పని కారణంగా పిల్లలు సంస్కారహీనులై కుటుంబాలు పతన మవుతున్నాయి కనుక కుటుంబ ప్రబోధన్‌ ద్వారా మంగళ సంవాద్‌, సత్సంగ్‌, యువ జంటల, నవ జంటల, ప్రౌఢ జంటల, కౌముదీ సమ్మేళనాలు యోజన చేస్తున్నాము’’ అన్నారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ వల్లీశ్వర్‌ మాట్లాడుతూ ‘అబ్దుల్‌కలామ్‌ తన జీవిత చరిత్రలో బాల్యంలో తన గురువులు తనలో శక్తి వుందని చెప్పారని, తాను ఎదగడానికి కారణమైనారని, సాధువులు, గురువులు సన్మార్గం చూపారని, చిన్నపుడు తన అమ్మ, అమ్మమ్మ రామాయణ కథలు చెప్పారని అదే తనకు ధర్మాధర్మ విచక్షణ నిచ్చిందని, చిన్నతనంలో మన స్నేహితులందరినీ మనం గుర్తుపెట్టుకుంటామనీ, మనకు స్నేహం చేయడం తప్ప మరో వ్యాపకం ఉండదనీ, ఎప్పటికీ మన శ్వాస మన ధ్యాస అదే కావాలి అనీ అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని, నేటి కుటుంబ సమస్యలన్నింటికీ భారతీయ సంస్కృతిలో పరిష్కారం ఉందని’ అన్నారు.

సీనియర్‌ జర్నలిస్టు రాకా సుధాకర్‌ మాట్లాతూ ‘శివుని కుటుంబం’ చిత్రం చూస్తే ఎన్నో వైరుధ్యాలున్నా శివుని కుటుంబమంతా కలిసే ఉందని, వారు ఆదర్శదంపతులు, ఆది దంపతులు అనీ, శివుని కుటుంబం చిత్రం అందుకే మన ఇంట ఉండాలని పెద్దలు చెప్పారన్నారు.

ఆధ్యాత్మికవేత్త శ్రీరామచంద్రమూర్తి గారు మాట్లాడుతూ ప్రతి కుటుంబం మందిరమయినట్లే, ప్రతి మందిరమూ కుటుంబాలతో నిండాలని భావిస్తున్నానన్నారు. హైందవ ధర్మం సనాతనమైనదని, మన సమస్యలకు మన స్వభావమే కారణమని, మనం ఏం చేయకూడదో భారతం చెబుతుందని, ఏం చేయాలో రామాయణం చెబుతుందని, ఒక ఏడాది పాటు రామాయణం స్వీకరించి ఆచరించే పద్ధతి మొదలు పెడితే కుటుంబ ప్రబోధము బలపడుతుందని, ప్రతి ఇంటా ఓ శ్రీరాముడు, ఓ సీత తయారు కావాలని తమ ప్రసంగంలో ఆకాంక్షించారు. కుమారి సరయు కుటుంబ ప్రబోధన గీతం శ్రావ్యంగా ఆలపించింది. కార్యక్రమానికి విచ్చేసిన మాతృ మూర్తులందరికీ పసుపు, కుంకుమ, పండ్లు, గాజులతో కూడి తాంబూలం ఇవ్వబడిరది.  ప్రసంగాల అనంతరం శివపూజ, దీపోత్సవం జరిగాయి. ఈ సమ్మేళనంలో సుమారు 200 మంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *