విత్తనాలను అప్పుగా ఇచ్చే బ్యాంక్

సాధారణంగా డబ్బులను అప్పు ఇచ్చే బ్యాంకు మనం చూస్తుంటాం. అవసరమైతే అందులో లోన్‌ తీసుకొని, మన అవసరాలను తీర్చుకుంటాం. ఇది మనందరికీ తెలిసిందే. అయితే.. విత్తనాల కోసమంటూ ఓ బ్యాంకు వుందని, అక్కడి నుంచి విత్తనాలను తీసుకుంటారని ఎప్పుడైనా విన్నారా? వేరే దేశంలో కాదు.. మన దేశంలోనే. ఎక్కడంటే ఇది మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని దిండోరి జిల్లాలోని గౌరా కన్హారి గ్రామంలో ఇలా సాగుతుంది. పుల్జారియా బాయి కెవాటియా.. అత్యంత సాధారణమైన గిరిజన మహిళ. స్థానికంగా రైతులు పండిరచే పంటల్ని సంరక్షించేందుకు ఈమె ఏకంగా ఓ బ్యాంకునే స్థాపించారు. అత్యంత సమర్థంగా నడిపిస్తున్నారు కూడా. ఇది అత్యంత సమర్థ వంతంగా నడవడానికి ఆ గ్రామంలోని మహిళ లందర్నీ సంఘటితం చేసింది కూడా.

గౌరా కన్హారి గ్రామంలో పంటను ఇంటికి తీసుకెళ్లడానికే ముందే అప్పుగా తీసుకున్నవాటికి రెట్టింపు విత్తనాలను చెల్లించడానికి బ్యాంకు ముందు క్యూలో నిల్చుంటారు. ఈ ప్రాంతం స్థానికంగా పండే పంటలకి, ముఖ్యంగా చిరు ధాన్యాలకు, పప్పుధాన్యాలకు బాగా పేరు గడిరచింది. అరికెలు, సామలనే ఎక్కువగా తీసుకుంటారు. దాదాపు 52 రకాల చిరు ధాన్యాలను పండిస్తారు. అంతటి అద్భుతమైన ప్రాంతంలో ఓ సారి కాలం వెక్కిరించింది. విత్తనాల కొరత తీవ్రంగా ఏర్పడిరది. అసలు విత్తడానికి గింజలే లేని కాలం వచ్చేసింది. దీంతో ఏం చేయాలో ఎవ్వరికీ తోచలేదు. ఎవ్వరిని అడగాలో తెలియలేదు. దీంతో విత్తనాల కోసం తామే ఓ బ్యాంకు పెట్టుకుందామని పుల్జారియా బాయి కెవాటియా తెలిపింది. దీంతో అందరితో సంప్రదించి, ముందుకెళ్లారు.

అయితే.. విత్తన బ్యాంకును నెలకొల్పడానికి పుల్జారియా బాయే ముందు వరుసలో నిల్చుంది. నిజానికి జూన్‌, జూలై మాసాల్లో విత్తనాలను నాటేస్తారు. సెప్టెంబర్‌ కల్లా పంట వచ్చేస్తుంది. కానీ ఈ సారి ఇబ్బందులు రాడంతో మహిళ లందరూ కలిసి చుట్టు పక్కల ప్రాంతాలన్నీ పర్యటించారు. నాణ్యమైన విత్తనాలను సేకరించారు. వాటిని భద్రపరిచి, ఎవరికైతే అవసరముంటుందో వారికి అప్పుగా ఇచ్చే బాధ్యతను ఆ మహిళ తీసుకుంది. 15 రకాల సామలు సహా 37 రకాల మిల్లెట్‌ విత్తనాలను రైతులు అప్పుగా తీసుకుంటారు. పంట రాగానే రెట్టింపు విత్తనాలను బ్యాంకులో చెల్లిస్తారని పుల్జారియా బాయి తెలిపింది. ఇంతటి అద్భుతమైన ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పర్చిన పుల్జారియా బాయి పై ఓ డాక్యుమెంటరీ కూడా వచ్చింది. సెంట్రల్‌ ఇండియా గ్రీన్‌ హబ్‌ ఆధ్వర్యంలో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు.

అయితే మొదట్లో ప్రజలందరూ తనను బాగా ఎగతాళి చేసేవారని, ఏమీ సాధించలేవని కూడా అవహేళన చేసేవారని తెలిపారు. అసలు విత్తన సేకరణ ఎందుకో? అంటూ అపహాస్యం కూడా చేశారని గుర్తు చేసుకున్నారు. కానీ..ఎవ్వరు ఏమి అనుకున్నా.. విత్తన సేకరణ అనే ఉద్యమం ఇప్పుడు ఓ దశకు వచ్చిందని, చాలా సంతోషంగా వుందన్నారు. అప్పట్లో ఎగతాళి చేసినవారే… ఇప్పుడు తనతో పాటుకలిసి వస్తున్నారని, ముందంజలో వున్నారని తెలిపారు. ఎవ్వరూ తనతో రాని సమయంలోనూ ఒంటరిగానే విత్తన సేకరణకు వెళ్తానని తెలిపింది. అయితే విత్తన సేకరణ సమయంలో మాత్రం వృద్ధులే ఎక్కువగా తనకు సహకరిస్తున్నారని చెప్పడం విశేషం.

అయితే విచిత్రమేమిటంటే ఈ మహిళకు అస్సలు చదువు లేదు. అయినా…. మిల్లెట్ల ప్రాధాన్యతను చాలా సంవత్సరాల క్రితం నుంచే గుర్తించి, వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి విశేషంగా కృషి చేస్తోంది. మిల్లెట్‌ అనేది మాంసకృత్తులు, ఫైబర్‌, విటమిన్లతో కూడి వుండే పోషకాహారమని తెలుపుతోంది. మధుమేహాన్ని నివారించడానికి, వివిధ రోగాల నుంచి మన శరీరాన్ని బయటపడేయడానికి ఉపకరిస్తాయని చెప్పింది. మిల్లెట్లు అత్యంత బలసంవర్ధకమైన ఆహారమని పేర్కొంది. మందుల ఖర్చును కూడా నివారిస్తుందని పేర్కొంది.

మరోవైపు మిల్లెట్లలో కోడో, కుట్కి, సికియా, సల్హార్‌, సావా మరియు చేనాతో సహా 150 రకాల విత్తనాలను సేకరిస్తోంది. ఇవన్నీ అంతరించి పోవడానికి సిద్ధంగా వున్నాయి. అలాంటి వాటినే సేకరించి, ముందు తరానికి అందివ్వాలని, తిరిగి వాడకంలోకి తీసుకొస్తానని ఘంటా పథంగా చెబుతోంది. ఇందులో మరో విచిత్రం కూడా వుంది. రైతులకు ఈ విత్తనాలను పంపిణీ చేస్తే, రైతులు పండిరచిన పంటలో కొంత భాగాన్ని ఆమెకే బహుమానంగా ఇచ్చేస్తారు. ఇది డబ్బు కోసం కాదని, విత్తనాల సంరక్షణ కోసమని తెలిపింది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా మిల్లెట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. బడ్జెట్‌ 2023లో వీటిని అన్నామృతంగా ప్రకటించింది కూడా. చిరుధాన్యాల పంటలకు కూడా సహకారం అందించనున్నట్టు, దీనికోసం శ్రీ అన్న పథకాన్ని తీసుకువచ్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటలకు ప్రోత్సాహాన్ని అందిస్తామని వెల్లడిరచారు. శ్రీ అన్న పథకం కోసం హైదరాబాద్‌ కేంద్రంగా పరిశోధనలు చేయనున్నట్లు తెలిపారు. పదివేల బయో ఇన్పుట్‌ వనరుల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *