నేవీ తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా పూనియా
నౌకాదళంలో మహిళా ఫైటర్ పైలట్లు వచ్చేశారు. దీంతో కొత్త శకం ప్రారంభమైంది. నావికా దళంలోని యుద్థ విమానం మొదటి మహిళా పైలట్ గా సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియా రికార్డు సృష్టించనున్నారు. నేవీలో మహిళా యుద్ధ విమాన పైలట్ల నూతన శకానికి ఆమె నాందిపలకనున్నారు. విశాఖ పట్టణంలోని ఐఎన్ఎస్ డేగాపై సెకండ్ బేసిక్ హాక్ కన్వర్షన్ కోర్సు స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ అతుల్ ధుల్, సబ్ లెఫ్టినెంట్ పునియాకి ప్రతిష్టాత్మక ‘‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’’ప్రదానం చేశారు.
నౌకాదళంలో మహిళా ఫైటర్ పైలట్ల యుగం ప్రారంభమైందని అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రియ్ అడ్మిరల్ జనక్బెల్వీ అన్నారు. నేవీ ఏవియేషన్ లో ఆస్తా పూనియా దేశంలోనే తొలి మహిళా ఫైటర్ పైలట్ గా నిలిచిందని ప్రశంసించారు. ఆమె భవిష్యత్తులో మిగ్ 29 లేదా నౌకాదళ రఫేల్ యుద్ధ విమానాలను నడిపే అవకాశం వుందని తెలిపారు. దానికి ముందు ఆమె యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ పొందనున్నారు.