అభిమానం
లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యే సమయానికి ఆయన పెద్ద కుమారుడు హరికృష్ణ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. ఆ తరువాత అతనికి సీనియర్ జనరల్ మేనేజర్‌గా ప్రమోషన్ వచ్చింది. అదే విషయం ఆయన తన తండ్రి అయిన లాల్ బహదూర్‌కు చెప్పారు.
అది విన్న శాస్త్రిగారు గంభీరంగా ‘హరీ నీకు వచ్చిన ప్రమోషన్ నీ పనితీరు చూసి ఇచ్చినది మాత్రమే కాదు.. నీవు ప్రధానమంత్రి కొడుకువు అనే కారణం కూడా అందులో కనిపిస్తోంది. రేపు ఆ కంపీవాళ్లు ఏదో సహాయం కోసం నా దగ్గరకు రావచ్చు. న్యాయ సమతంగానే నేను వారికి సహాయం చేయవచ్చు. కానీ అప్పుడు జనం ఏమనుకుంటారో తెలుసా? నీ సహ చరులు ఏమను కుంటారో తెలుసా? అందుకని ఒక పనిచేయి. ఈ రోజే నీ ఉద్యోగానికి రాజీనామ ఇవ్వు నేను ప్రధానమంత్రిగా ఉన్నన్నాళ్ళూ నువ్వు ఆ కంపెనీలో ఉద్యోగం చేయడం నాకీష్టం లేదు’ అన్నారు. దానితో హరికృష్ణ మరునాడే తన ఉద్యోగానికి రాజీనామ చేశారు.
పదవి ద్వారా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ తాను ప్రయోజనం పొందానని ఎవరూ భావించకూడదని శాస్త్రిగారు అలా చేశారు.