HCU విద్యార్థి సంఘం ఎన్నికల్లో ABVP ఘన విజయం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్లలో ఏబీవీపీ ప్యానెల్ వామపక్ష విద్యార్థి సంఘాల కూటమిపై విజయం సాధించింది.
ప్రెసిడెంట్‌గా శివ పాలేపు, వైస్ ప్రెసిడెంట్‌గా దేవేంద్ర, జనరల్ సెక్రటరీగా శృతి, జాయింట్ సెక్రటరీగా సౌరభ్ శుక్ల, స్పోర్ట్స్ సెక్రటరీగా జ్వాల ప్రసాద్, కల్చరల్ సెక్రెటరీగా వీనస్ విజయం సాధించారు. స్కూల్ స్థాయిలో కౌన్సిలర్లు, బోర్డు మెంబర్లలో విజయం సాధించి ఏబీవీపీ మెజారిటీ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులంతా ఏకతాటిగా నిలిచి గత ఆరు సంవత్సరాలుగా NSUI, లెఫ్ట్ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పడిన స్టూడెంట్ యూనియన్ ఫెయిల్యూర్లను ఎండగడుతూ ఎబివిపి ని గెలిపించిన విద్యార్థులు. వామపక్ష విద్యార్థి సంఘాలు కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘమైన NSUI తో చేతులు కలిపి ఏబీవీపీని ఓడించాలని అనేక కుట్రలకి ఈ విజయం చెంపపెట్టు లాంటిది. ఈ దేశంలోని యువతకి ఈ ఎన్నికల ద్వారా జాతీయవాదమే దేశానికి భద్రత అని మరొక్కసారి నిరూపించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు.
Abvp HCU Victory
వామపక్ష విద్యార్థి సంఘాలకు అడ్డాగా చెప్పుకునే HCUలో భారీ మెజారిటీ మధ్యలో ఏబీవీపీ ప్యానెల్ విజయం సాధించడం చూస్తుంటే వామపక్ష విద్యార్థి సంఘాలకు, వామపక్ష భావజాలానికి ఈ దేశంలో నూకలు చెల్లాయానే విషయం ఈ విద్యార్థి సంఘ ఎన్నికల ద్వారా తేటతెల్లమవుతుంది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘమైన NSUIకి NOTA కంటే తక్కువ ఓట్లు రావడం చూస్తుంటే కాంగ్రెస్ సిద్ధాంతానికి, వారు చేస్తున్న విషప్రచారానికి విద్యార్థులు క్యాంపస్ పరిసరాలలో కాంగ్రెస్ రాజకీయాలను తిప్పికొట్టినట్లు ఉంది. సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్‌లలో కూడా విద్యార్థుల మస్తిష్కాలలో విషాన్ని నింపే అనేకమంది ప్రొఫెసర్ల మాటలను పక్కనపెట్టి అక్కడ కూడా కేవలం ఎబివిపి విద్యార్థి సంఘాన్ని గెలిపించి ఆ డిపార్ట్మెంట్లో ఎప్పుడు అందించని విజయాన్ని అందించి వామపక్ష ప్రొఫెసర్ల ఆటలు చెల్లవని విద్యార్థులు నిరూపించారు.
క్యాంపస్‌లో ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేయడంలో, HCU భూముల పరిరక్షణ విషయంలో ఏబీవీపీ ముందుండి పోరాడిన తీరును మరియు నిరంతరం విద్యార్థుల సమస్యలపై స్పందిస్తూ ఉద్యమాల ద్వారా సమస్యల పరిష్కారానికి చేసిన కృషిని గుర్తించి విద్యార్థులు ఏబీవీపీకి పట్టం కట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *