రామాయణాన్ని, రాముడ్ని కించపరుస్తూ మళ్లీ వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్
ప్రముఖ నటుడు, నిత్యం హిందుత్వాన్ని మాత్రమే విమర్శించే ప్రకాశ్ రాజ్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళ సాహిత్య ఉత్సవం వేదికగా హిందువులు అత్యంత పవిత్రంగా ఆరాధించే రాముడ్ని, రామాయణాన్ని అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేశారు. కేరళ సాహిత్య ఉత్సవం సందర్భంగా అక్కడి చిన్నారులు రామాయణ నాటకాన్ని వేశారు. ఈ సందర్భంగానే ప్రకాశ్ రాజ్ రామాయణాన్ని, రాముడ్ని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు.
రామ లక్ష్మణులు వలస కూలీలంటూ అపహాస్యం చేశారు. అలాగే వారు ఉత్తర భారతానికి చెందినవారని, వారిద్దరూ దక్షిణ భారతానికి చెందిన రావణుడి పొలంలో పండ్లు దొంగలించారని చెప్పుకొచ్చారరు. దానిని చూసిన శూర్పణఖ జీఎస్టీతో కలిపి 2 వేల డాలర్లు కట్టాలని అడిగినట్లు ఎద్దేవా చేశారు. అంతేకాకుండా రావణుడు దీనికి డిస్కౌంట్ కూడా ఇచ్చాడని, రాముడు ఆ మొత్తాన్ని చెల్లించలేకపోయినందున రావణుడు రామ లక్ష్మణులను విత్తనాలు నాటమని ఆదేశించాడని చెప్పుకొచ్చారు.
అదే సమావేశంలో, కేరళను సందర్శించేవారు మలయాళ భాషతో పరిచయం కలిగి ఉండాలని, ఆహార నియమాలకు సంబంధించిన చర్చల నేపథ్యంలో, ఎవరూ తాము తినే ఆహారాన్ని వదులుకునేలా బలవంతం చేయబడకూడదని అన్నారు. మరో వైపు ప్రకాష్ రాజ్ ఉద్దేశపూర్వకంగానే రామాయణాన్ని, రామ లక్ష్మణులను అవమానించారని, అలాగే హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీశారంటూ కొందరు పోలీసులకు ఈ నెల 16 న న్యాయవాది అమితా సచ్ దేవా ఫిర్యాదు చేశారు.