సౌర శక్తి ఆధారిత పునరుత్పాదక ఇంధన పార్క్ ఇదీ.. ఇతర దేశాలకు సౌర శక్తి ఉత్పత్తి

సౌర విద్యుత్‌ విషయంలో అదానీ గ్రూపు ఓ పెద్ద ముందడుగు వేసింది. గుజరాత్‌ లోని ఖవ్దా ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కు అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ను స్థాపించింది. ఇది ప్రధానంగా సౌరశక్తి ఆధారితమైన 45 డబ్ల్యూజీ సామర్థాన్ని కలిగి వుంటుంది. మొదట ఇది బంజరు భూమిగా వున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఈ భూమిలో లవణీయ శాతం కూడా ఎక్కువగా వుందని, దీంతో వృక్ష సంపద, మానవ నివాసం కూడా లేదు. దీంతో ఈ స్థలాన్ని పునరుత్పాదక ఇంధన వనానికి వినియోగించుకుంటున్నారు. ఈ ప్రాంతం లడఖ్‌ తర్వాత దేశంలో రెండో అత్యుత్తమ సౌర కిరణాన్ని, మైదాన ప్రాంతాల్లో వుండే గాలి వేగం కంటే ఐదు రెట్లు ఎక్కువగా వుంది. పాక్‌కి కేవలం ఒక కిలోమీటర్‌ దూరంలోనే ఈ ఎనర్జీ పార్క్‌ వుంటుంది. దీంతో భద్రతా దళాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తుంటాయి. ఈ పార్క్‌ గరిష్టంగా 81 బిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను అంటే బెల్జియం, చిలీ, స్విట్జర్లాండ్‌ వంటి దేశాలకు సరిపడే విద్యుత్‌ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 30 మెగావాట్ల క్లీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి అదానీ సంస్థ 150 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *