దుష్టాచార వినాశాయ
ఏప్రిల్ 28 శ్రీ శంకర జయంతి
దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః
దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (శివరహస్యము నుండి).
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా
శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుండి).
ఆర్యమాంబ, శివగురులకు కేరళలోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు క్రీ.పూ. 509 సంవత్సరంలో జన్మించారు. శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు.
సన్యాస స్వీకారము
గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, ‘‘ప్రాతఃకాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, తలచుకోగానే, నీవద్దకు వస్తాను’’ అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తరువాత శిష్యులతో కలిసి శంకరులు శ్రీశైలం వంటి క్షేత్రాలను సందర్శించారు. శ్రీశైలంలో ‘‘శివానంద లహరి’’ స్తోత్రాన్ని రచించారు.
సర్వజ్ఞపీఠం అధిరోహణ
కాష్మీర దేశంలో శారదాపీఠాన్ని సందర్శించారు. అక్కడి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు.