”వైద్యో నారాయణో హారి:” వాగులు దాటుతూ 16 కిలోమీర్లు నడిచి వనవాసులకు వైద్యం అందించిన వైద్యుడు

తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి… ఆదివాసులకు వైద్యం అందించారు ఓ అధికారి. ములుగు జిల్లా వైద్యాధికారి డా. అప్పయ్య కొండ కోనల్లో వుండే వనవాసీలకు నేరుగా తానే వైద్యం అందించాలని నిర్ణయించారు. ములుగు ప్రాంతంలో వుండే వనవాసీలు తీవ్రమైన జ్వరాలతో బాధపడుతున్నారని తెలుసుకున్నారు. దీంతో ఆయనే స్వయంగా వారి వద్దకు వెళ్లాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా తన వైద్య బృందంతో కలిసి వాజేడు ండలంలోని పెనుగోలుకు వెళ్లారు. మధ్యలో భారీ వర్షం కురుస్తున్నా సరే… ఓ పెద్ద వాగును దాటి మరీ.. ఆ ప్రాంతానికి చేరుకున్నారు. భారీ వర్షం కురుస్తున్నా.. దట్టమైన అడవిలో 16 కిలోమీర్లు నడిచారు.

 

ఈ క్రమంలో తనకు అడ్డుగా వచ్చిన వాగులు, వంకలన్నింటినీ దాటుతూ.. ఆ గ్రామానికి వెళ్లారు. సాయంత్రానికి ఆ గ్రామానికి చేరుకున్నారు. వెంటనే వనవాసులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అప్పటికే రాత్రి కావడంతో అక్కడే బసచేశారు. దీంతో వనవాసులు, ప్రజలు ఆయన్ను అభినందించారు. నిజానికి ఈ గ్రామాలకు వేసవి కాలంలోనే కాలి నడక వెళ్లొచ్చు. మిగిలిన కాలలో అసలు సాధ్యమయ్యే పనేకాదు. ఆ గ్రామం చుట్టూ వాగులు, వంకలే. కానీ.. ఆ వనవాసులు పడుతున్న అనారోగ్య సమస్యలు చూసి, తానే స్వయంగా వైద్యం అందించాలని అనుకునే వచ్చాననివెల్లడిరచారు.

 

ఛత్తీస్‌గడ్ – తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో పెనుగోలు గ్రామం ఉంటుంది. దట్టమైన అడవిలో కనీసం ఎడ్ల బండి కూడా వెళ్లలేని దయనీయ స్థితిలో గుట్టపై ఈ గ్రామం ఉంటుంది. పెనుగోలు గ్రామానికి వెళ్లాలంటే సామాన్యులకు సాహస యాత్రే. ఇక్కడ నివసించే గిరిజనులకు మాత్రం అలవాటై పోయింది. కానీ కొత్త వారు రావాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే..!

 

డాక్టర్ అప్పయ్యతో పాటు వైద్య సిబ్బంది అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులు దాటుకుంటూ అడవి మార్గంలో నడుచుకుంటూ పెనుగోలు గ్రామానికి వెళ్లారు. కనీసం రోడ్డు మార్గం కూడా లేని ఈ కారడవిలో కేవలం కర్రలు చేత పట్టుకుని సాహస యాత్ర చేశారు. ఒకరికొకరు సపోర్ట్‌గా వాగులు దాటుకుంటూ వెళ్లారు. భుజాన వైద్య పరికరాలు, మందులు పెట్టుకుని దాదాపు 16 కిలోమీటర్ల మేర కాలినడకన పెనుగోలు గ్రామానికి చేరుకున్నారు. డాక్టర్ అప్పయ్య నేతృత్వంలో వైద్య బృందం ఈ గ్రామంలో గిరిజనుల హెల్త్ సమస్యలు తెలుసుకున్నారు. వారి రక్త నమూనాలు సేకరించి అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు. జ్వరాలతో అవస్థలు పడుతున్న వారికి మెడిసిన్ అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *