రక్షణ రంగంలో యూత్ ప్రొఫైల్‌ను కొనసాగించడానికే అగ్నిపథ్ : సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్
రక్షణ రంగంలో దేశ యువతను నిలబెట్టేందుకు చేపట్టిన ప్రధాన సంస్కరణల్లో అగ్నిపథ్ ఒకటని ఆర్మీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. యూత్ ప్రొఫైల్‌ను కొనసాగించడానికి ఈ సంస్కరణ తెచ్చినట్లు పేర్కొన్నారు. ఒడిశాలోని భారత నావికాదళానికి చెందిన శిక్షణా కేంద్రం ఐఎన్‌ఎస్ చిల్కాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మరోవైపు నేవీ వారందరూ సాంకేతికంగా బాగా సుశిక్షుతులైన సముద్ర ఫైటర్స్‌గా మారేందుకు సాధన చేయాలని సూచించారు. భారత నౌకాదళానికి సంబంధించిన సముద్ర యోధులను రూపొందించడంలో ఐఎన్‌ఎస్ చిల్కా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 2022 లో మూడు సర్వీసుల వయస్సు ప్రొఫైల్‌ను తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం స్వల్పకాలిక సిబ్బందిని చేర్చుకోవడం కోసం అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ నిర్వహిస్తుందన్నారు.