స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో వ్యర్థాల నిర్వహణలో స్ఫూర్తిగా నిలిచిన ఆగ్రా

గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది ఆగ్రా నగరం. అయితే.. దాని ఘన వ్యర్థాల నిర్వహణలో మాత్రం చాలా కాలంగా సవాల్ ను ఎదుర్కొంటోంది. 2007 నుంచి కుబేర్ పూర్ డంప్ సైట్, ప్రతి రోజూ వేలాది టన్నుల వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దీంతో పర్యావరణ సమతౌల్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది.అలాగే పర్యావరణ విపత్తుకు కూడా చిహ్నంగా మారింది. స్థానికులందరూ అక్కడే చెత్త పారబోసేవారు. అక్కడి పాలనా అధికారులకు కూడా ఇది సవాల్ గా మారిపోయింది.

అయితే… ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ భారత్ ను ఆదర్శంగా తీసుకొంది. అంతే అక్కడి పరిస్థితులు మారిపోయాయి. డిసెంబర్ 20204 నాటికి డంపింగ్ యార్డ్ పూర్తిగా మారిపోయింది. అంతేకాకుండా 2025 నాటికి ఆగ్రాలోని ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సిటీగా పరిణామం చెందింది. పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక ఆవిష్కరణకు నమూనాగా మారిపోయింది.

స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ ఓ అద్భుతమైన పరివర్తనను సాధించింది. ఒకప్పుడు అత్యంత భయంకరంగా వున్న డంపింగ్ యార్డ్.. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సిటీగా పరివర్తనం చెందింది. దీని ద్వారా 47 ఎకరాల భూమి తిరిగి స్వాధీనమైంది. 1.9 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేశారు. అలాగే 500 TPD వ్యర్థాల నుంచి కంపోస్ట్ ప్లాంట్ 405 TPD సామర్థ్యమున్న నాలుగు మెటీరియల్ రికవరి సౌకర్యాలతో సహా అధునాతన వ్యర్థ నిర్వహణ మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు.

అలాగే బయోరెమిడియేషన్, బయోమైనింగ్, వినూత్న పద్ధతుల ద్వారా పర్యావరణ పునరుజ్జీవింపజేయడమే కాకుండా స్థిరమైన పట్టణ అభివృద్ధికి కారణమైంది. 2014 లో ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ స్ఫూర్తితో స్థిరమైన వ్యర్థాల నిర్వహణ, పట్టణ పరిశుభ్రత, బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగారు.SBM-U 2.0 కింద, అధునాతన వ్యర్థాల ప్రాసెసింగ్, భూ పునరుద్ధరణ మరియు ప్రజా అవగాహనపై దృష్టి మళ్లింది.

2019 లో SPAAK సూపర్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో బయోరెమిడియేషన్ మరియు బయోమైనింగ్ టెక్నాలజీలను ఉపయోగించడంతో కుబేర్ పూర్ పరివర్తన ప్రారంభమైంది. ఈ బయోరెమిడియేషన్ లో సేంద్రీయ వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడానికి సూక్ష్మ జీవులను ఉపయోగిస్తారు. ఈ ప్రాసెస్ కొనసాగింది. 2024 నాటికి ఆగ్రా మున్సిపల్320 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం వ్యర్థాలను విజయవంతంగా ప్రాసెస్ చేసింది. 47 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. విషపూరిత వ్యర్థాల నుంచి బయటపడింది.

వ్యర్థాల నుంచి కంపోస్ట్ ప్లాంట్ :

2019 లో సేంద్రీయ వ్యర్థాలను వ్యవసాయ వినియోగం కోసం అధిక నాణ్యత గల కంపోస్ట్ గా మార్చడానికి రోజుకు 300 టన్నుల వ్యర్థాల నుంచి కంపోస్ట్ ప్లాంట్ ను చేశారు. 2023 నాటికి దాని సామర్థ్యాన్ని రోజుకు 500 టన్నులకు పెంచారు. దీంతో పల్లపు ప్రాంతాలకు పంపే వ్యర్థాల పరిమాణం తగ్గిపోయింది.

మెటీరియల్ రికవరి సౌకర్యాలు :

ప్లాస్టిక్, కాగితం, లోహాలు వంటి పునర్వినియోగం చేసే పదార్థాలను క్రమబద్ధీకరించడానికి, ప్రాసెస్ చేయడానికి ఆగ్రాలో 405 TPD (TUNN PER DAY)సామర్థ్యం కలిగిన నాలుగు మెటీరియల్ రికవరి యంత్రాలను ఉపయోగంలోకి తెచ్చారు. దీంతో వ్యర్థాలను వేరుచేయడం చకాచకా జరిగిపోయింది.

ప్లాస్టిక్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్: జనవరి 2025లో, 65 TPD MRF-కమ్-ప్లాస్టిక్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రారంభించబడింది. ఈ సౌకర్యం ప్లాస్టిక్ వ్యర్థాలను సరసమైన నీటి పైపులుగా రీసైకిల్ చేస్తుంది, వీటిని రైతులకు విక్రయిస్తుంది, ఇది ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తుంది మరియు వ్యవసాయ స్థిరత్వానికి మద్దతు ఇస్తుంది.

వీటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ వ్యర్థాలను వేరే చేయాలని నిర్ణయించింది. తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేరే చేయాలని కూడా నిర్ణయించారు. వ్యర్థాల ప్రాసెసింగ్ ను క్రమబద్ధీకరణ చేయడానికి ఇంటింటి నుంచి చెత్త సేకరణ అన్న వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.

ప్రజల్లో అవగాహన కూడా అంతే స్థాయిలో…

తమ ప్రాంతాన్ని బాగు చేసుకోవాలని, వ్యర్థాల నుంచి బయటపడాలని స్థానికులు కూడా భావించారు. దీంతో ఓ కొత్త విషయం అధ్యయనం చేయడానికి స్థానిక విద్యార్థులకు అవకాశం వచ్చింది.ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిటీ పర్యావరణ విద్య చదవడానికి ఉపయోగపడింది. వ్యర్థాల నిర్వహణ పద్ధతులను అధ్యయనం చేయడానికి IITలు మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వంటి సంస్థల నుండి విద్యార్థులు, పరిశోధకులు మరియు నిపుణులు ఈ స్థలాన్ని సందర్శించారు. ఇకపై కూడా ఇది కొనసాగుతుంది. ప్రజా అవగాహన కోసం ప్రచారం కూడా అంతే స్థాయిలో జరిగింది.

ఆర్థిక అవకాశాలను కూడా సృష్టించింది…

ఈ చొరవ ఆర్థిక అవకాశాలను కూడా సృష్టించింది. వ్యర్థాల నుండి కంపోస్ట్ చేసే ప్లాంట్ మరియు ప్లాస్టిక్ ప్రాసెసింగ్ సౌకర్యం ఉద్యోగాలను సృష్టించగా, సరసమైన నీటి పైపుల ఉత్పత్తి వ్యవసాయ రంగానికి తోడ్పడింది.పర్యావరణ పర్యాటకాన్ని ఆకర్షించే మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థను మరింత ఉత్తేజపరిచే సామర్థ్యాన్ని తెచ్చిపెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *