అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ పేరు ఇకపై ‘‘అహిల్యా నగర్’’ : రైల్వే నిర్ణయం
భారతీయ రైల్వే శాఖ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పూణే డివిజన్ లోని అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ పేరును అహల్యా నగర్ గా మార్చింది. లోకమాతా అహల్యా బాయి హోల్కర్ కి నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. గతంలో ఈ స్టేషన్ ను అహ్మద్ నగర్ గా పిలిచేవారు. ఇప్పటి నుంచి అహల్యానగర్ గా పిలుస్తారని రైల్వే పేర్కొంది.అయితే స్టేషన్ కోడ్ లో మాత్రం ఎలాంటి మార్పు వుండదని రైల్వే పేర్కొంది. అహల్యా నగర్ రైల్వే స్టేషన్ గా పిలుస్తూ, గతంలో లాగే ANG తోనే కొనసాగుతుంది.
దీని ప్రకారం, మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క నోటిఫికేషన్ మరియు భారత సర్వేయర్ జనరల్ లేఖ ప్రకారం, స్టేషన్ యొక్క కొత్త పేరును ఈ క్రింది విధంగా చదవాలి మరియు వ్రాయాలి: దేవనాగరి లిపిలో (మరాఠీ): అహిల్యాంగర్.దేవనాగరి లిపిలో (హిందీ): ahilyaangr. రోమన్ లిపిలో (ఇంగ్లీష్): అహిల్యనగర్ గా పిలవాలి.