అత్యంత ఆధునికత సంతరించుకున్న రైతుల ఛానల్.. డీడీ కిసాన్ లో ”ఏఐ యాంకర్లు”

భారత దేశ రైతుల కోసం ప్రత్యేకంగా ప్రారంభమైన ఛానెల్‌ డీడీ కిసాన్‌. మరో రెండు రోజుల్లో ఈ ఛానెల్‌ ప్రారంభమై తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో డీడీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ కాలం నడుస్తున్న కాలమిది. దీంతో ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టాలని యాజమాన్యం నిర్ణయించింది.ఏఐ క్రిష్‌, ఏఐ భూమి పేరుతో ఈ సాంకేతికతను తీసుకురానున్నారు. దేశంలో ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టిన తొలి ప్రభుత్వ టీవీ ఛానల్‌గా డీడీ కిసాన్‌ ఖ్యాతి సంపాదించనుంది. ఈ సందర్భంగా డీడీ కిసాన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

”ఈ యాంకర్లు ఏఐ అనుసంధాన కంప్యూటర్లు. ఇవి కూడా అచ్చు మనుషుల్లాగే వుంటాయి. 365 రోజులు 24 గంటలు వార్తలు చదువుతూనే వుంటాయి.దేశంలోని రైతులందరూ దీనిని చూడొచ్చు. వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిశోధనల దగ్గర నుంచి మార్కెట్లో ధరలు, వాతావరణ అంశాలు, ప్రభుత్వ పథకాలు సహా ప్రతీ సమాచారాన్ని ఇస్తాం. ఏకంగా 50 భాషల్లో ఈ ఏఐ మాట్లాడగలవు.”మరో వైపు  2015 మే 26 న ఈ ఛానెల్‌ రైతుల కోసం ప్రారంభమైంది. రైతుల కోసమే ప్రత్యేకంగా ఈ ఛానెల్‌ తయారైంది. వాతావరణ మార్పులు, సాగు దిగుబడి , గ్రామీణ వ్యవసాయం ఇందులో వుంటుంది. ఈ ఛానెల్‌ను 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *