“పంచ పరివర్తన్” — విశ్వగురు భారత్’’పై AI- ఏనిమేషన్ గీతం

RSS@100 సంవత్సరాల వేడుకలు దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, వివిధ కళారంగాలకు చెందిన ప్రతిభావంతుల నుంచి అనేక సృజనాత్మక నివాళులు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి నివాళులలో ప్రత్యేకత, వినూత్నత మరియు భావోద్వేగ లోతుతో మెరిసిపోతున్న ఒక “పంచ పరివర్తనం” — విశ్వగురు భారత్ అనే భావనను అద్భుతంగా ప్రతిబింబించే AI- ఏనిమేషన్ గీతం ఎంతో ప్రత్యేకత సంతరించుకుని,అందరి మన్ననలను పొందుతుంది.
జాతీయచిత్రఅవార్డు ( స్వర్ణకమలం) గ్రహీతలైన ఏనిమేషన్ చిత్ర దర్శకులు సత్యకాశీ భార్గవ మరియు భారవి కొడవంటి ఆలోచనతో రూపుదిద్దుకుని, ఐతిహాస్ (Aithihaas) పతాకం కింద రూపొందిన పంచ పరివర్తన గీతం, ఆధునిక AI ఆధారిత దృశ్యాలు, ఆకట్టుకునే ఏనిమేషన్ శైలి మరియు మధురమైన బాల స్వరాల ద్వారా, భారత్ విశ్వగురువుగా ఎదగడానికి అవసరమైన ఐదు కీలక పరివర్తనలను సరళంగా, హృద్యంగా వివరిస్తుంది.
ఈ గీతం ప్రత్యేకత దాని ప్రదర్శనలోనే కనిపిస్తుంది—అత్యంత అందమైన భారతీయ సంస్కృతి,సంప్రదాయత ఉట్టిపడుతున్న పిల్లలు, విలక్షణమైన రంగుల దృశ్యాలు, ఆకర్షణీయమైన స్వరం మరియు మధురమైన బాలగానం,తొలిసారి విన్న క్షణం నుంచే హృదయాన్ని తాకి, చిరకాలం మనసులో నిలిచిపోతుంది. లోతైన జాతీయ ఆలోచనలను పిల్లలకు అర్థమయ్యేలా సంగీతం మరియు కథనాల రూపంలో అందించడం ఈ గీతం యొక్క ప్రధాన విజయం.
ఈ గీతం ఆవిర్భావం గురించి మాట్లాడుతూ సత్యకాశీ భార్గవ ఇలా అన్నారు..
“భారత్ పిల్లలు సులభంగా నేర్చుకుని, పాడుకుని, ఆచరించుకుని జీవితాంతం తమతో తీసుకెళ్లేలా ఉండే ఒక గీతాన్ని అందించడమే మా ఆలోచన. మహానుభావులు ఆవిష్కరించిన ‘పంచ పరివర్తనలు’ పిల్లలు చిన్నతనంనుంచే నేర్చుకుని ఆచరించాల్సిన మూల పరివర్తనాలు. అవే ఆత్మనిర్భర భారత్ నిర్మాణానికి బలమైన పునాది.”
pancha parivarthan ai2
పిల్లల పట్ల మన బాధ్యతను ప్రస్తావిస్తూ ఆయన మరింతగా—
“భారత్ సుమారు 40 కోట్ల మంది పిల్లల దేశం. వారిని సరైన దిశలో తీర్చిదిద్దడం మనందరి మీద ఉన్న గొప్ప బాధ్యత. సరైన మార్గదర్శనం లభిస్తే, వీరే రేపటి వికసిత భారత్‌కు ప్రధాన శిల్పులు అవుతారు.” అని అన్నారు.
ఐతిహాస్ అనేది సాంకేతికత మరియు సంప్రదాయం సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ఒక వినూత్న కార్యక్రమం. భారతీయ సంస్కృతి, విలువలు మరియు జీవన తత్వంతో ముడిపడి ఉండేలా, పిల్లల కోసం ప్రేరణాత్మకమైన కథలు మరియు కంటెంట్‌ను సృష్టించడమే దీని లక్ష్యం.
ఈ గీతంలో ప్రతిపాదించిన పంచ పరివర్తనాలు క్లిష్టమైన సిద్ధాంతాలు కావు; ఇవి సాధారణమైన, దైనందిన జీవన విలువలు. చిన్న వయస్సు నుంచే ఇవి అలవాటు చేసుకుంటే, అవే భారత్‌ను విశ్వగురుగా నిలబెట్టే బలమైన పునాదిగా మారుతాయి—జ్ఞానం, విలువలు మరియు ఆచరణ ద్వారా ప్రపంచానికి దారి చూపించే భారతదేశం నిర్మించబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *