ఈశాన్య రాష్ట్రంలో ‘‘రైల్వే విప్లవం’’… వ్యాపారం, ప్రజల కనెక్టివిటీలో కొత్త విప్లవం

ఈశాన్య రాష్ట్రాలు అన్ని రంగాల్లోనూ ఇప్పుడు ముందజంలో సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు ప్రత్యేకంగా చొరవ కూడా తీసుకుంటోంది. ఇందులో భాగంగా రైలు విప్లవం నడుస్తోంది. 2018 నుంచి 2025 వరకు దాదాపు 10 రైల్ ప్రాజెక్టులు అక్కడ జరగాయి. రైల్వే నెట్ వర్క్ లో గణనీయమైన పరివర్తన వచ్చింది.

రాష్ట్రాల రాజధానులను అనుసంధానించడం మొదలు.. మారుమూల, కొండ ప్రాంతాలకు కూడా విద్యుత్ రైళ్లను విస్తరించడం వంటి 10 కీలకమైన పరిణామాలు సంభవించాయి. అంతేకాకుండా గతంలో అంతగా పట్టించుకోని రైల్వే లైన్లను కూడా ఆధునీకరించారు. మారుమూల, కొండ ప్రాంతాలను కూడా విద్యుత్ లైన్లు చేశారు. దీంతో రైలు మార్గం అక్కడి వారికి మరింత అందుబాటులోకి వచ్చింది. రైల్వే కూడా లాభాల్లో నడుస్తోంది. దీంతో మౌలిక సదుపాయాలు, సామాజిక, ఆర్థిక వృద్ధి పెంపొందింది. దేశంలోని మిగతా ప్రాంతాల లాగే ఈశాన్య రాష్ట్రాలు కూడా అనుసంధానమవుతున్నాయి.

1. 26 ఏళ్ల తర్వాత రైల్వే నెట్ వర్క్ లోకి వచ్చిన ఐజ్వాల్

26 ఏళ్ల తర్వాత ఐజ్వాల్ ఇప్పుడు భారత రైల్వేతో అనుసంధానమైంది. కొత్తగా 51.38 కిలోమీటర్ల బైరాబి- సైరాంగ్ బ్రాడ్ గేజ్ రైల్వేలైన్ ప్రారంభమైంది. ఇందులో 48 సొరంగాలు, 55 వంతెనలు, 87 చిన్న వంతెనలున్నాయి.జాతీయ సమైక్యతకు, ప్రయాణ, సరుకు రవాణాతో పాటు యాక్ట్ ఈస్ట్ పాలసీకి గేమ్ ఛేంజర్. స్థానిక రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ కి తలరించడానికి, వ్యాపారాలు చేసుకోడానికి, ఉద్యోగ ఉపాధికి బాగా ఉపకరిస్తోంది.

2. విద్యుత్తీకరణ, పర్యావరణ అనుకూల రైల్వే మార్గాలు

రాజధానులకు సంబంధించిన రైల్వే విద్యుత్తీకరణ పనులు కూడా బాగా పుంజుకున్నాయి. వీటిని IRCON పూర్తి చేసింది.
ఇది లుమ్డింగ్-టిన్సుకియా మరియు దిబ్రూఘర్-దులియాజన్ విభాగాలను కవర్ చేస్తుంది.మొదట దిబ్రూఘర్ ప్రాంతంలో విద్యుద్దీకరణ పూర్తైంది. రాజధాని ఢిల్లీకి రైళ్లు కూడా నడుస్తున్నాయి. ఇది గ్రీన్ రైలు విస్తరణలో ఓ ప్రధాన మైలురాయి. అంతేకాకుండా ప్రయాణ సమయం కూడా తగ్గుతోంది. ఇంధన ఖర్చులు, ఉద్గారాలను కూడా తగ్గిస్తుంది. వాణిజ్యం, పర్యాటకం, ప్రాంతీయ కనెక్టివిటీ పెంచుతోంది.

3. మణిపూర్ లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే పియర్ వంతెన

ఈ వంతెన ఈశాన్య కనెక్టివిటీని పెంచుతోంది.మణిపూర్‌లోని జిరిబమ్-తుపుల్-ఇంఫాల్ రైల్వే ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే పియర్, నోనీ వంతెన. 45 సొరంగాలు, 145 వంతెనలున్నాయి. చాలా పెద్ద రైల్వే లైన్ గా చెప్పుకుంటారు.నోనీ వంతెన ఇంఫాల్-జిరిబామ్ ప్రయాణ సమయాన్ని 12 గంటల నుండి కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు. స్థానికంగా కనెక్టివిటీని, వాణిజ్య, పర్యాటకాన్ని పెంచుతోంది. జాతీయ సమైక్యతను కూడా బలోపేతం చేస్తోంది. అలాగే ఆగ్నేయాసియాతో భవిష్యత్తు బంధాలను బలోపేతం చేస్తుంది.

4.షోఖువి-మోల్వోమ్ రైలు మార్గం

సరుకు రవాణాకు ఈ రైలు మార్గం బాగా ఉపయోగపడుతోంది. నాగాలాండ్ రైల్ నెట్ వర్క్ లో గణనీయమైన పురోగతి సాధించింది. దాదాపు ఈ రైలు మార్గం 15.42 కి.మీ. దూరం వుంటుంది.ధన్సిరి – జుబ్జా ప్రాజెక్టులో అతిపెద్ద మార్గమిది. గూడ్స్ తరలింపులో బాగా ఉపయోగంషోఖువి-మోల్వోమ్ రైల్వే నాగాలాండ్ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది, ఇది కీలకమైన సరుకు రవాణా మార్గాన్ని జోడించడం, రవాణా ఖర్చులను తగ్గించడం మరియు స్థానిక వాణిజ్యానికి ఉపయోగపడుతోంది. అలాగే మార్కెట్ కి సంబంధించిన యాక్సెస్ ను పెంచుతోంది.

5. మేఘాలయాలో కూడా సరుకు రవాణా రైళ్లు

ఈ మధ్య మేఘాలయాలో గూడ్స్ రైళ్ల రాకపోకలు పెరిగాయి.ఆహార ధాన్యాలను తీసుకెళ్లే గూడ్సు రైళ్లు మొదటిసారిగా నార్త్ గారో హిల్స్ కి వచ్చింది. ఈ మధ్యే నాలుగు కొత్త ట్రాకులు, ప్రత్యేక గూడ్స్ యార్డ్ ద్వారా సులభం చేశారు. అలాగే తొలి గూడ్స్ రైలు కూడా ప్రారంభమైంది. దీంతో రవాణా రైళ్ల రాకపోకలు, వస్తువులు చౌకగా అందించడం, వేగంగా రవాణా చేయడం, వాణిజ్యం ఈ ప్రాంతంలో పెరిగింది.

6. గౌహతిలో మొదటి వందే భారత్ రైలు ప్రారంభం

గౌహతి నుంచి న్యూ జల్పైగురి వరకు అసోం ప్రాంతంలో తొలి వందే భారత్ రైలు ప్రారంభమైంది.407 కిలోమీటర్లను ఈ ఆధునిక రైలు కేవలం 5 గంటల్లోనే కవర్ చేస్తుంది. వారంలో 6 రోజులు సేవలందిస్తుంది. అధునాతన ఆన్ బోర్డు సౌకర్యం వుంటుంది.గౌహతి – న్యూ జల్పైగురి మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గిస్తుంది. కాజీరంగ జాతీయ ఉద్యానవనం మరియు కామాఖ్య ఆలయం వంటి దిగ్గజ ప్రదేశాలకు పర్యాటకాన్ని గణనీయంగా పెరిగింది. అలాగే అసోం, బెంగాల్ మధ్య కనెక్టివిటీ కూడా పెరిగింది.

7.100 సంవత్సరాల తర్వాత నాగాలాండ్ లో రెండో రైల్వే స్టేషన్..

కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత నాగాలాండ్ లో రెండో రైల్వే స్టేషన్ వచ్చింది. షోఖువీ ప్రాంతంలో ఇది వచ్చింది. దీంతో పాటు దిమాపూర్ వంటి ప్రాంతంలో కూడా రైల్ కనెక్టివిటీ పెరిగింది.దిమాపూర్‌ను కోహిమాతో అనుసంధానించే లక్ష్యంతో ఉన్న ధన్సిరి-జుబ్జా రైలు ప్రాజెక్టులో కీలకమైనది.డోన్యి పోలో ఎక్స్‌ప్రెస్‌ను ఈ కొత్త స్టేషన్‌కు పొడిగించారు. స్థానిక వాణిజ్యం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు కూడా బలోపేతమయ్యాయి.

8. స్వాతంత్రం వచ్చిన తర్వాత మణిపూర్ లోకి మొదటిసారి గూడ్స్ రైలు…

మణిపూర్ లో కూడా ఓ చరిత్ర సృష్టించింది రైల్వే శాఖ. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి రాణి గైడిన్లియు ప్రాంతానికి మొదటి గూడ్స్ రైలు వచ్చింది.అలాగే అక్కడ తమెంగ్ లాంగ్ జిల్లా పేరు మారిన తర్వాత కూడా చారిత్రాత్మక క్షణంగా పేర్కొంటున్నారు. ఈ రైలు కొనసాగుతున్న జిరిబమ్-ఇంఫాల్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా వచ్చింది.వస్తువుల రవాణా, స్థానిక వ్యాపారాలకు మెరుగైన మార్కెట్ కూడా లభిస్తోంది. దీంతో రోడ్డు రవాణాపై ఆధారపడటం బాగా తగ్గి, సమయం ఆదా అవుతోంది.

9. మణిపూర్ – త్రిపురను కలిపే మొదటి జన శతాబ్ది రైలు

మణిపూర్ త్రిపురను కలిపే మొదటి జన శతాబ్ది రైలు ప్రారంభమైంది. దీంతో ఈశాన్యంలో అంతర్రాష్ట్ర కనెక్టివిటీకి కొత్త శకానికి నాంది అయ్యింది. ఈ మూడు వారాల్లో నడిచే రైలు 6 గంటల్లో 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీనిని 1,000 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.మణిపూర్ త్రిపుర మధ్య గతంలో 12 గంటల ప్రయాణం. ఈ రైలుతో కేవలం 6 గంటలే.

10. బోగిబిల్ రైల్వే వంతన..

ఈశాన్య భారత అనుసంధానంలో కీలక పాత్ర. 4.94 కిలోమీటర్ల పొడవైన వంతెన. అద్భుతమైన ఇంజినీరింగ్ తో డబుల్ డెక్కర్ నిర్మాణం. రైల్వే ట్రాక్ పైన మూడు లేన్ల రహదారి వుంది. 5,900 కోట్లతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈశాన్య రాష్ట్రాంలో రోడ్డు రైలు మార్గాన్ని ఏకీకృతం చేస్తుంది. ముఖ్యంగా ఇది చైనా సరిహద్దు దగ్గర సైనికుల లాజిస్టిక్ పెంచుతుంది. మారుమూల, కొండ ప్రాంతాల్లో వాణిజ్యాన్ని పెంచుతుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *