ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఆదివారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. భారత్, పాక్ మధ్య పరిస్థితులు మారిపోయిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యమేర్పడింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నౌకా దళాధిపతి అడ్మిరల్ దినేష్ త్రిపాఠీ కూడా ప్రధాని మోదీని కలుసుకున్నారు.
మరోవైపు గత వారంలో కూడా ప్రధాని నివాసంలో త్రివిధ దళాల అధిపతులతో భేటీ జరిగింది. ఎప్పుడు, ఎలా స్పందించాలో నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ పూర్తిగా సైన్యానిదే అని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని అధ్యక్షతన ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు కొనసాగింది. పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) బుధవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నది. వారం వ్యవధిలో ఈ భేటీ రెండోసారి.